పవన్‌ వద్దకు మనోజ్‌ను మోహన్ బాబు పంపారా !?

భీమ్లా నాయక్ షూటింగ్ సెట్‌లో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ చర్చలు జరిపారు. మాములుగా అయితే ఎవరూ పట్టించుకోరు కానీ ప్రస్తుతం “మా” రగడ కొనసాగుతున్నందున అదే అంశంపై చర్చించేందుకు మోహన్ బాబు పంపించి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మోహన్ బాబు మా ఎన్నికల్లో పైచేయి సాధించారు. ఎలా సాధించారన్నదానిపై విమర్శలు ఉన్నా.. గెలుపు గెలుపే. ఇప్పుడు అందర్నీ కలుపుకుని వెళ్తే తప్ప ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు.

ఏకపక్షంగా వెళ్తే ఇండస్ట్రీ చీలిపోతుంది. ఇలాంటి సమయంలో బాధ్యత తీసుకున్న మోహన్ బాబు మెగా క్యాంప్‌తో మళ్లీ మంచి సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని కలుస్తానని మంచు విష్ణు ప్రకటించిన తర్వాత మంచు మనోజ్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. ఎన్నికలకు ముందు మోహన్ బాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివాదం ఉంది. పాయింట్ టు పాయింట్ స్పందిస్తానని మోహన్ బాబు ప్రకటించారు.

కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. మాట్లాడాలని కూడా అనుకోవట్లేదని చెబుతున్నారు. టాలీవుడ్‌లోని పెద్దలందరూ ప్రస్తుతం వివాదానికి ముగింపు పలికి అందరూ కలిసి పని చేసుకోవాలనే పద్దతిలో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మోహన్ బాబు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మంచు మనోజ్ కలిశారని అంటున్నారు. అదే నిజమైతే.. మా రాజకీయాలకు టాలీవుడ్‌లో పుల్‌స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close