అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను చూసి భయపడుతున్నారు. చైనా కంటే ముందు భారత్ ను ఆయన నియంత్రించాలని అనుకుంటున్నారు. అందుకే భారత్ ఏ విషయంలో అమెరికాపై ఎక్కువ ఆధారపడుతుందో గుర్తించి ఆ అంశాలపైనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ ఆధారం అనేది పరస్పర ప్రయోజనాల కారణంగానే ఉంటోందని భారత్ పై కానీ..భారతీయులపై కానీ జాలితో కాదని తెలుసుకోలేకపోతున్నారు. భారత్ ను అదే పనిగా టార్గెట్ చేసుకుంటున్నారు.
భారత్ సూపర్ పవర్ అవుతుందన్న భయం
ప్రధాని మోదీని వ్యక్తిగతంగా మిత్రుడంటున్న ఆయన ..భారత్ ను మాత్రం భవిష్యత్ తో తమ స్థానాన్ని కాజేసే దేశంగా అనుమానిస్తున్నారు. అత్యున్నత ప్రజాస్వామ్యం, కష్టపడే ప్రజలు, నైపుణ్యాలున్న మ్యాన్ పవర్ అన్నీ కలిసి భారత్ ను సూపర్ పవర్ చేస్తాయని అనుకుంటున్నారు. ప్రపంచం మొత్తం జనాభా సంక్షోభం ఉంది కానీ అందరి మ్యాన్ పవర్ అవసరాలు తీర్చే శక్తి భారత్ కు ఉంది. ఇది ట్రంప్ ను ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చైనా కంటే భారత్‌నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న వైనం
ఆయన ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్ అందరికీ వర్తిస్తాయికానీ.. తీసుకునే నిర్ణయాలు భారతీయుల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేసేలా ఉన్నాయి. H1b విషయంలో ఇది తేటతెల్లమయింది. రష్యా చమురును కారణంగా చూపి భారత్ పై ఆంక్షలు కూడా ఈ కోణంలోనే. రష్యా చమురును కొంటున్నది ఇండియానే అయినా మళ్లీ ఇండియా నుంచి ప్రాసెస్ చేసిన ఆ చమురును కొంటున్నది యూరప్, అమెరికాలే. చైనా ఇండియా కంటే ఎక్కువ కొనుగోలు చేస్తోంది. కానీ చైనా పై సుంకాలు వేయలేకపోతున్నారు.
భారతీయులు లొంగరు !
భారత్ ఎప్పుడూ తన దేశ ప్రయోజనాలు చూసుకుంది. కానీ ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోలేదు. ప్రపంచంలో ఎప్పుడూ ఏ విధమైనా అలజడికి కారణం కాలేదు. పరస్పర ప్రయోజనాల రీతిలోనే అన్ని దేశాలతో వ్యవహరించింది. ట్రంప్ ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకుని భారత్ ను బ్లాక్ మెయిల్ చేసి..బెదిరించి.. మన దేశాన్ని బానిసగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ భారత్ తల వొంచదని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు.