‘నిశ్శ‌బ్దం’పై రూమ‌ర్లు న‌మ్మొద్దు

‘నిశ్శ‌బ్దం’ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు లెక్క‌లేదు. ముఖ్యంగా ఆ రూమ‌ర్ల‌న్నీ అనుష్క చుట్టూనే కేంద్రీకృత‌మై న‌డుస్తున్నాయి. చిత్ర‌బృందానికీ అనుష్క‌కీ అస్స‌లు ప‌డ‌డం లేద‌ని, అనుష్క ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ప్ర‌మోష‌న్ల‌కు రాన‌ని తెగేసి చెప్పేస్తోంద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల న్యూసులు. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ‘నిశ్శ‌బ్దం’ రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి డ‌వ‌లప్‌మెంట్స్ లేవు. అయినా స‌రే.. రూమ‌ర్ల‌కు ఫుల్ స్టాప్ ప‌డ‌లేదు. దాంతో చిత్ర‌బృందం ఈ విష‌యంపై స్పందించాల్సివ‌చ్చింది.

ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందిస్తున్న స‌హ‌కారం మ‌ర్చిపోలేద‌ని, ముఖ్యంగా అనుష్క క‌ష్ట‌కాలంలో కూడా త‌మ‌కు అండ‌గా నిలిచింద‌ని, ఈ సినిమాపై వ‌స్తున్న ఎలాంటి రూమ‌ర్ల‌నీ న‌మ్మొద్ద‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ ఇస్తామ‌ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. ఇక‌నైనా ఈ పుకార్లు ఆగుతాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close