డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి – దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది. ఇప్పుడు ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ వ‌స్తోంది. ఇందులో పూరి కొత్త‌గా ఏం చెప్ప‌బోతున్నాడు? కొత్త‌గా ఏం చూపించ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి నెల‌కొంది అంద‌రిలోనూ.

అయితే ఈసారి కూడా పూరి ‘చిప్‌’నే న‌మ్ముకొన్నాడు. కాక‌పోతే.. చిప్ మారిందంతే. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో స‌త్య‌దేవ్ చిప్‌.. రామ్ లో ఫిక్స్ చేస్తారు. ఈసారి.. సంజ‌య్ ద‌త్ చిప్ వాడార‌ని టాక్‌. సంజూభాయ్ ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌ని మెమొరీని హీరోలో ఇంజెక్ట్ చేస్తారు. ఆ త‌ర‌వాత జ‌రిగే డ్రామానే ‘డ‌బుల్ ఇస్మార్ట్’ క‌థ‌. ప్ర‌స్తుతం ముంబైలో ఓ కీల‌క‌మైన షెడ్యూల్ న‌డుస్తోంది. దీంతో టాకీ పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత పాట‌ల్ని హైద‌రాబాద్ లోనే తెర‌కెక్కిస్తారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి బాణీలు స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంక‌ర్లో’ పాట‌ల‌న్నీ హిట్టే. ఈసారి అంత‌కు మించిన ఆల్బ‌మ్ రాబోతోంద‌ని టాక్‌. మూడు మాస్ పాట‌ల్ని ఈ సినిమా కోసం మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేశారు. అమ్మ సెంటిమెంట్ తో ఓ పాట కూడా ఉంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close