సుభాష్ : ఏపీ సర్కార్ పరువు తీసిన ఉద్యోగాల ప్రహసనం ..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటూ… దాదాపుగా లక్షమందికిపైగా నియామకపత్రాలు అందజేశారు. కానీ అసలు తాము ఎందుకు ఎంపికయ్యాయో… ఎంపికైన వాళ్లకి క్లారిటీ లేదు. ఎందుకు కాలేదో.. పరీక్ష రాసి ఫెయిలయిన వాళ్లకూ తెలియలేదు. అసలు ఎవరెవరికి ఎన్ని మార్కులొచ్చాయో.. కటాఫ్ ఏంటో ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రి రూల్స్ మార్చేశారు. అసలు ఇన్ని సందేహాల మధ్య ఉద్యోగాల భర్తీ జరిగింది. కాల్ లెటర్లు ఇచ్చిన వారికి ఉద్యోగాల్లేవన్నారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన వారికీ అదే మాట ఎదురయింది. అసలేం జరిగిందో.. ప్రభుత్వానికైనా తెలుసో లేదో..?

నోటిఫికేషన్ నుంచి ఒక్క ప్రక్రియ అయినా సక్రమంగా సాగిందా..?

ఉద్యోగాల భర్తీ అంటే… ఓ పద్దతి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువరిస్తారు. అందులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం.. భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లీకేజీ జరిగినట్లు అనుమానాలు తలెత్తిస్తే.. సమగ్రమైన విచారణ జరుపుతారు. అంతే కాని అక్రమంగా మార్కులు తెచ్చుకున్న వారికి ఉద్యోగం కట్టబెట్టే ప్రయత్నమే చేయరు. ఫలితాల ప్రకటన తర్వాత కటాఫ్ మార్కులు వెల్లడిస్తారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. అంతకు మించి.. చివరి క్షణంలో నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ చేయరు. అలా జరిగితే.. ఉద్యోగ నియామకాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగాయని అర్థం. కానీ గ్రామ, సచివాలయ ఉద్యోగాల భర్తీ అలా జరిగిందా.. అంటే… వంద శాతం లేదనే చెప్పాలి. ప్రతీ దశలోనూ… ఉద్యోగల భర్తీ ప్రక్రియపై అనుమానాలు తలెత్తాయి…

ఎవరికి ఉద్యోగాలివ్వాలో.. వారికి తగ్గట్లుగా రూల్స్ మార్చేసుకుంటారా..?

రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ సర్కార్.. ముందుగా రూల్సేమీ పెట్టుకోలేదు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో.. వారికి సరిపోయే రూల్స్‌ను చివరి వరకూ మారుస్తూ వెళ్లింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీలో కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రే రూల్స్ మార్చేశారు. కాల్‌ లెటర్లు అందుకుని ఉద్యోగానికి ఎంపికయ్యామన్న ఆనందంతో.. సర్టిఫికెట్ల వెరీఫికేషన్ కి వెళ్లిన వారికి.. గేట్ల దగ్గరే… నిరాశ ఎదురవుతోంది. పేపర్ లీకేజీ దగ్గర్నుంచి ఈ సమస్య ఉంది. ఒక సామాజికవర్గం వారికే.. జనరల్ కోటాలో.. అత్యధిక ఉద్యోగాలు వచ్చాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది కోచింగ్ సెంటర్ల యజమానులు ర్యాంకర్లను తమ ముందుకు తీసుకు వస్తే.. అసలు వారికి ఎలా ర్యాంకులు వచ్చాయో బయట పెడతామని సవాల్ చేశారు. అంతే కాదు.. గ్రూప్స్ , సివిల్స్ పరీక్షల్లో.. మంచి ప్రతిభ చూపిన వారికి… 70 మార్కుల వరకూ రాగా… టాపర్లకు 115 మార్కుల వరకూ వచ్చాయి. ఈ టాపర్లు గతంలో ఏ ఉద్యోగ పరీక్షలోనూ.. కనీసం ప్రాధమిక పరీక్షను కూడా దాటిన వాళ్లు కాదనే విమర్శలు ఉన్నాయి

నిరుద్యోగుల్లో అలజడి ప్రభుత్వానికే ప్రమాదకరం..!

ఇలాంటి వాటిపై పరీక్షలు అభ్యర్థుల సందేహాలకు సమాధానాలివ్వడానికి ఏపీ సర్కార్ ఏ మాత్రం.. ఆసక్తి చూపించడం లేదు. సరికదా.. అంతకంతకూ గోప్యతను పెంచకుంటూ పోయారు. విభాగాల వారీగా ఇంత వరకూ మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. జిల్లాల వారీగా ఉద్యోగాలకు ఎంపికయిన వారి జాబితా అసలు ప్రకటించలేదు. వారికెన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పడం లేదు. అదే సమయంలో.. అనేక మందికి… తక్కువ మార్కులొచ్చినప్పటికీ.. కాల్ లెటర్లు అందుతున్నాయి. ఈ విషయం తెలియడంతో.. ఇతర అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమకే ఎక్కువ మార్కులొచ్చాయని… తమకు ఉద్యోగం రావాలి కానీ.. తక్కువ మార్కులొచ్చిన వారికి ఉద్యోగం ఎలా వచ్చిందని అసంతృప్తి చెందుతున్నారు. నిజానికి అసలు సచివాలయ ఉద్యోగుల పరీక్షలు చట్టబద్ధమేనా అన్న చర్చ ప్రారంభమయింది. పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్లు ఇచ్చి.. ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అలా.. ఏ శాఖకు ఆ శాఖ ఉద్యోగుల్ని నియమించుకునే సంప్రదాయం లేదు. శాశ్వత ఉద్యోగుల్ని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ శాశ్వత ఉద్యోగాలని చెబుతూనే… గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీని మాత్రం ఏపీపీఎస్సీకి ఇవ్వలేదు. దీని వల్ల నష్టపోయేది ఎవరు..? అర్హులు కాని వారితో ఉద్యోగాలు నింపితే.. నిరుద్యోగుల్లో అలజడి రేగదా..? ప్రభుత్వ మౌనం.. ప్రమాదకరం కాదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close