పుష్ష పాట‌లు రెడీ అయ్యాయ‌ట‌!

లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. సెట్స్ లో సంద‌డి మాయ‌మైంది. కాక‌పోతే గుడ్డిలో మెల్ల‌లా.. అక్క‌డ‌క్క‌డ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మెల్ల‌మెల్ల‌గా జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుల‌కు కొత్త ట్యూన్లు పుట్టించే ఛాన్స్ దొరికింది. దేవిశ్రీ ప్ర‌సాద్ అయితే `పుష్ష‌` పాట‌లు రెడీ చేసేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని దేవినే చెప్పాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా `పుష్ష‌`. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే స‌గం పాట‌ల్ని దేవి రెడీ చేసేశాడు.

లాక్‌డౌన్‌కి ముందే దేవి ఓ పాట ప్రిపేర్ చేసి, రికార్డింగ్ చేసేసి, చిత్ర‌బృందానికి వినిపించాడు. ఆ పాట విని బన్నీ, సుకుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యార‌ని, ఆ పాట‌తోనే షూటింగ్ ప్రారంభించాల‌నుకున్నార‌ని, అయితే లాక్‌డౌన్ వ‌ల్ల ఆ షూటింగ్ ఆగిపోయింద‌ని చెప్పాడు. సుకుమార్, బ‌న్నీల సినిమా అంటే త‌న‌కు చాలా ప్ర‌త్యేకం అని, ఈ సినిమాలో స‌రికొత్త సంగీతం వినే అవ‌కాశం ఉంద‌ని, కొత్త త‌ర‌హా ట్యూన్లు, సౌండింగ్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు దేవి.

దేవి – సుక్కు కాంబినేష‌న్ అంటే ఓ ప్ర‌త్యేక గీతం ఆశిస్తాం. `పుష్ష‌`లో కూడా అలాంటి పాట ఉంద‌ని ముందు నుంచీ గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పాట‌కు సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు దేవి. మ‌రోసారి ఐటెమ్ గీతంతో మ్యాజిక్ చేయ‌డానికి చిత్ర‌బృందం అంతా క‌ష్ట‌ప‌డుతుంద‌ని, ఈసారి కూడా త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకునే పాట‌లే వ‌స్తాయ‌ని అంటున్నాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close