పుష్ప ఐటెం సాంగ్: ‘సుకు’మారమైన ట్యూన్ ఎందుకు ?

ఏఆర్ రెహ్మాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. మొజార్ట్ అఫ్ ఇండియా. రోమాలు నిక్కబొడిచే పాటలు, నేపధ్య సంగీతం ఇవ్వగల దిట్ట. ఒక్క చిన్న మ్యూజికల్ పీస్ తో కంట్లో నీళ్ళు తిరిగేలా చేసే నేర్పు తెలిసిన కంపోజర్. ఒక సీన్ ని ఊపిరి బిగపట్టుకొని చూసేలా నేపధ్య సంగీతం చేయగల వెటరన్. కానీ సినిమా చూస్తున్నప్పుడు విజల్స్ కొట్టి, షర్టు చించుకొని స్క్రీన్ పైకి పేపర్లు విసిరి పూనకంతో ఊగిపోయే సౌండింగ్ మాత్రం రెహమాన్ నుంచి ప్రోడ్యుస్ కాదు. ఆయన స్టయిల్ అది కాదు. పవన్ కళ్యాణ్ లాంటి కమర్షియల్ హీరో సినిమా ‘కొమరం పులి” కోసం ఐటెం సాంగ్ చేయమంటే.. ”దోచేయ్.. దొరికింది దోచేయ్”అంటూ కర్ణాటక సంగీతంలో ఏవో మేళకర్త రాగాలు వినిపించాడు తప్పితే క్యాచి బీట్ తీసుకొని మోత మోయించలేదు. అయితే రెహమాన్ ని ఇలా వినడానికి ఆడియన్స్ కి ఇబ్బంది లేదు. కానీ అదే స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వుంటే ప్రేక్షకుల అంచనాలు మరోలా వుంటాయి. దేవిశ్రీ ప్రసాద్ ని ఒకలా కోరుకుంటారు. ”నేను వేరే జోన్ లోకి వెళ్లి ఒక ఐటెం సాంగ్ చేస్తా” అని దేవిశ్రీ ప్రసాద్ అంటే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ‘పుష్ప’ ఐటెం సాంగ్ పై కూడా ఇదే రకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

గత దశాబ్దకాలంలో ఐటెం సాంగ్స్ ని గ్లోరిఫై చేసిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ కి అగ్ర తాంబూలం. సుకుమార్ దేవిశ్రీ కలసిన తర్వాత ఐటెం సాంగ్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. ఆ అంటే అమలాపురం, డియ్యోలో.. డియ్యోలా, రింగరింగా,, జిగేలు రాణి .. పాటలు ఐటెం సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న పుష్ప ఐటెం గీతంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పాట బయటికి వచ్చింది. పాట విన్న ఆడియన్స్ కి చిన్న షాక్. అసలు ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ చేశాడా ? అనే అనుమానం వచ్చింది. పాటలో ఎలాంటి దోషం లేదు. బావుంది కూడా. కానీ అల్లు అర్జున్ – సుకుమార్- దేవిశ్రీ ల ఐటెం సాంగ్ లక్షణాలు ఈ పాట వినిపించలేదు. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అని టీజర్ వదిలినప్పుడు బన్నీ ఫ్యాన్స్ చొక్కాలు చించుకొవడానికి రెడీ అయిపోయారు. తీరా పాట వినేసరికి.. బావుంది కానీ.. ఇదేం బీటు.. ? సుకుమార్ ఇలాంటి ట్యూన్ ని ఎలా ఓకే చేశాడు ? అసలు మాస్ ఏది ? దీనికంటే ..’నా సామీ’ పాటే ఐటెం సాంగ్ లా వుందే.. ” ఇలా రకరకాల కామెంట్లు.

ముందే చెప్పుకున్నట్లు.. ప్రతి సంగీత దర్శకుడికి ఒక వేవ్ లెంత్ వుంటుంది. ఆ వేవ్ లెంత్ తోనే ఆడియన్ కనెక్ట్ అవుతాడు. దేవిశ్రీ ప్రసాద్ కి ఆడియన్స్ కూడా ఒక కనెక్షన్ వుంది. దేవి నుంచి ఐటెం పాట అంటే ఒక రకమైన సౌండింగ్ ని వూహించుకుంటారు. ఒక రకమైన అంచనా పెట్టుకుంటారు. పుష్ప ఐటెం పాట మాత్రం ఈ అంచనాలకు భిన్నంగా వుంది. హరీష్ జయరాజ్, యువన్ శంకర్ రాజా కి ఐటెం సాంగ్ చేయమంటే.. బహుషా ఇలాంటి సాంగ్ నే ప్రోడ్యుస్ చేస్తారు. ఇప్పుడు దేవిశ్రీ నుంచి ఇలాంటి సౌండ్ బయటికి వచ్చేసరికి ఆడియన్స్ షాక్ అయుపోయారు.

నిజానికి పుష్ప అడవి నేపధ్యం వున్న సినిమా. ఇప్పటివరకూ బయటికి వచ్చిన మేటిరియల్ అంతా రా గా వుంది. ఐటెం సాంగ్ లో కూడా రా సౌండ్ వినిపిస్తుందని అనుకుంటే,., ఒక కబ్ల్ సెటప్ లో ట్యూన్ వినిపించింది. పైగా ఆ ట్యూన్ కూడా కొత్తగా లేదు. సూర్య ‘వీడోక్కడే’ సినిమాలో ‘హనీహనీ’ అనే ఒక పాట వుంటుంది. ఆ బీట్ కి దగ్గరగా పుష్ప ఐటెం సాంగ్ ట్యూన్ వినిపించింది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ క్యాచిగా వున్న ట్యూన్ అమరిక మాత్రం సాహిత్యం అంతా ఎవరికో అప్పగించినట్లు పాడించిన విధానం ఆకట్టుకోలేకపోయింది.

నిజానికి పుష్ప ఐటెం సాంగ్ గురించి టీం చాలా కసరత్తులు చేసింది. సమంతని భారీ పారితోషికం ఇచ్చి తీసుకొచ్చారు. ముగ్గురు డ్యాన్స్ మాస్టర్లు మారారు. స్పెషల్ సెట్ వేశారు. ఇంత ప్రిపరేషన్ వున్న ఈ సాంగ్ మాత్రం వినడానికి మాములుగానే సాగిపోయింది. ఆ అంటే అమలాపురం, రింగరింగా మాస్ ని మ్యాచ్ చేసేలా మాత్రం లేదు. అయితే ఇలాంటి సాఫ్ట్ ట్యూన్ ని తీసుకోవడానికి బహుషా హీరో పాత్ర కూడా ఒక కారణం కావచ్చు, మంచి ఊపు తెచ్చే ట్యూన్ ఇస్తే గూని పాత్రలో కనిపిస్తున్న బన్నీ డ్యాన్స్ చేయడానికి కొన్ని లిమిట్స్ వుంటాయి. పాట మాస్ గా వుండి డ్యాన్స్ కుదరకపొతే మళ్ళీ ఒక నిరాశ. అల్లు అర్జున్ అంటే డ్యాన్స్ కింగ్. బన్నీ సినిమాలో సిగ్నేచర్ స్టెప్పులు వుంటాయి. కానీ ఇప్పటివరకూ వచ్చిన పుష్ప పాటల్లో బన్నీ డ్యాన్సల జోలికి వెళ్ళలేదు. ”సూపె బంగారం.. నా సామీ పాటల్లో .. బన్నీ అలా నిలబడటం తప్పితే.. ఒక సిగ్నేచర్ స్టెప్ వేసినట్లు చూపించలేదు. బహుషా పాత్ర పరిమితులకు లోబడి కూడా సుకుమార్ అటు క్లాస్ ఇటు మాస్ కాకుండా మధ్యస్థంగా వున్న ట్యూన్ ని ఓకే చేసుంటారని భావించవచ్చు. ఏదేమైనా.. పుష్ప ఐటెం సాంగ్ .. ఆడియో పరంగా అ అంటే అమలాపురం, రింగారింగా పాటల సరసన చేరే పాట అయితే కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close