‘పూన‌కాలు’ పాటెలా అయ్యింది దేవి..?

వాల్తేరు వీర‌య్య నుంచి `పున‌కాలు లోడింగ్` పాటొస్తోంది… అది అద‌ర‌గొట్టేస్తుంది… ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం` అంటూ ఈ పాట గురించి చిత్ర‌బృందం ఓ రేంజ్‌లో స్టేట్‌మెంట్లు గుప్పించింది. అందులో ర‌వితేజ కూడా క‌నిపిస్తాడు కాబ‌ట్టి జ‌నాలు ఎక్కువ‌గానే ఊహించుకొన్నారు. చిరు, ర‌వితేజ మాస్ స్టెప్పులూ, దేవిశ్రీ బీటూ.. ఎలా ఉంటాయో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇన్ని ఎదురుచూపుల మ‌ధ్య ఆ పాట వ‌చ్చింది… కానీ అది పాటెలా అయ్యింద‌న్న‌దే ఎప్పుడ ప్ర‌శ్న‌.

మూడు నిమిషాల సుదీర్ఘ మ్యూజిక్ బిట్ ఇది. `డోన్ట్ స్టాప్ డాన్సింగ్… పూన‌కాలు లోడింగ్` అనే హుక్ లైన్‌.. చిన్న‌పాటి రాప్ త‌ప్ప‌.. ఇందులో పాట‌నేదే లేదు. ఇదో మ్యూజిక్ బిట్ అంతే. దాన్ని పాట రేంజ్‌లో ఊహించుకొనేస‌రికి… అభిమానులు డీలా ప‌డ్డారు. విన‌గా…. విన‌గా.. ఆ ఊపూ, ఉత్సాహం వ‌స్తాయేమో గానీ… విన‌గానే ఊపొచ్చేసే… పాట (బిట్‌) అయితే కాదిది. దీన్ని పాట‌గా రిలీజ్ చేయ‌డం పెద్ద త‌ప్పు. దానికి భారీ బిల్డ‌ప్ ఇవ్వ‌డం ఇంకా పెద్ద త‌ప్పు. ఈ బిట్ ఇప్పుడు రిలీజ్ చేయ‌కుండా థియేట‌ర్లోనే చూపిస్తే… జ‌నాల‌కు కిక్ వ‌చ్చేదేమో. `ధ‌మాకా`లో ఇదే చేశారు. `ప‌ల్స‌రు బైకు` పాట ఉంద‌ని అస్స‌లు చెప్ప‌లేదు. దాన్ని థియేట‌ర్లో రివీల్ చేసే స‌రికి బాగా పేలింది. ఆ పాట ఊపు తెచ్చింది. పూన‌కాల‌కూ అదే స్ట్రాట‌జీ వాడి ఉంటే బాగుండేది. నిజానికి… వాల్తేరులో చిరు, ర‌వితేజ మ‌ధ్య పాట పెట్టే సెట్యువేష‌న్ లేదు. అందుకే మ్యూజిక్ బిట్ తో స‌రిపెట్టాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close