దుల్కర్ కి ఇంత క్రేజా?

దుల్కర్ స‌ల్మాన్‌…. ఈ మ‌ల‌యాళీ న‌టుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచ‌య‌మే. కొన్ని డ‌బ్బింగ్ సినిమాలతో.. మ‌న‌వాళ్ల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. త‌ను చేసిన ఒకే ఒక్క స్ట్ర‌యిట్ సినిమా… మ‌హాన‌టి. ఇప్పుడు `సీతారామం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో ఈవెంట్లు నిర్వ‌హించింది చిత్ర‌బృందం. ఈ ఈవెంట్లు దుల్క‌ర్ క్రేజ్‌కి అద్దం ప‌ట్టాయి. రెండు చోట్లా.. దుల్క‌ర్‌ని చూడ్డానికి జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఎయిర్ పోర్టు నుంచే.. జ‌నం దుల్క‌ర్‌ని చూడ్డానికి, సెల్ఫీలు తీసుకోవ‌డానికి పోటీ ప‌డ్డారు. సాధార‌ణంగా… ఓ స్టార్ హీరో ఈవెంట్ల‌కు ఎంత జ‌న‌సందోహం హాజ‌ర‌వుతుందో, `సీతారామం`కీ అంతేమంది జ‌నం వ‌చ్చారు. ఈ క్రౌడ్‌లో అమ్మాయిలూ క‌నిపించ‌డం విశేషం. దుల్క‌ర్‌కి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇవ‌న్నీ `సీతారామం`కి ప్ల‌స్ అవుతాయ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. దుల్క‌ర్ కూడా `సీతారామం`పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాడు. మ‌ల‌మాళంలో ఓ సినిమా చేసినా.. ప్ర‌మోష‌న్ల‌కు ఇంత టైమ్ వెచ్చించ‌ని దుల్క‌ర్‌.. `సీతారామం` కోసం ఇంకొంచెం ఎక్కువ ప్రేమ‌నే చూపిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగులోనూ దుల్క‌ర్ సెటిల్ అవుదామ‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్‌. ఈనెల 5న సీతారామం విడుద‌ల అవుతోంది. ఇటీవ‌ల కాలంలో ప్రేక్ష‌కులు సినిమాల‌కు రావ‌డం బాగా త‌గ్గించేశారు. ఏ సినిమాకీ స‌రైన ఓపెనింగ్స్ ఉండ‌డం లేదు. `సీతారామం` ఓపెనింగ్స్ గ‌నుక అదిరిపోతే.. అదంతా దుల్క‌ర్‌కి ఉన్న క్రేజ్ అనే అర్థం చేసుకోవాలి. మ‌రి దుల్క‌ర్‌కి అంత ఉందా, లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close