దుల్కర్ సల్మాన్ పీరియడ్ డ్రామా ‘కాంత’ లీగల్ చిక్కుల్లో పడింది. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై తాజాగా చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రముఖ తమిళ నటుడు, సంగీతకారుడు త్యాగరాజ భగవతార్ మనవడు బి. త్యాగరాజన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సినిమా తన తాత మే.కే.త్యాగరాజ భగవతార్ ని మంచి నడవడిక లేని వ్యక్తిగా, జీవితం చివర్లో పేదరికంలో ఉన్నట్టుగా చూపించారని పేర్కొన్నారు. ఇది వాస్తవానికి విరుద్ధమని, ఆయన 1959లో మరణించే వరకు గౌరవప్రదమైన స్థాయిలో జీవించారని పిటిషన్ లో స్పష్టం చేశారు.
భగవతార్ వారసుల అనుమతి లేకుండా సినిమా తీసినందుకు నిర్మాతలపై డిఫమేషన్, పర్సనల్ రైట్స్ ఉల్లంఘన కేసులు వేశారు. సినిమా విడుదల, డిస్ట్రిబ్యూషన్, స్ట్రీమింగ్ హక్కులపై శాశ్వత నిషేధం విధించాలని కోరారు.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇది పూర్తి ఫిక్షన్ స్టొరీని కాంత యూనిట్ చెబుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారు కాబట్టి.. రిలీజ్ ని ఆపడం కష్టం. కాకపోతే.. ఇలాంటి వివాదాలు సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని తీసుకొస్తుంటాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి తెలియని వాళ్లకూ `కాంత`ని చేరవేస్తాయి. ఆ రకంగా `కాంత` సినిమాకు ప్లస్సే అనుకోవాలి. పైగా సినిమా నేపథ్యంలో వచ్చే ప్రతీ సినిమాకూ.. ఇలాంటి వివాదాలు మామూలే. కానీ ఏ పిటీషనూ సినిమాని ఆపలేకపోయింది. ఈసారీ అలానే జరగొచ్చు.


