దుల్కర్ సల్మాన్ మంచి నటుడు. తన కథల ఎంపిక బావుటుంది. ఏ పాత్ర చేసిన అందులోకి పరకాయ ప్రవేశం చేసేయగల నటుడు. కాకపోతే ఆయన సినిమా గురించి వేదికల్లో ఇంటర్వ్యూ ల్లో గొప్పగా చెప్పుకోవడం వుండదు. అలాగే హైప్ క్రియేట్ చేసే పని కూడా పెట్టుకోడు. అయితే కాంత సినిమా విషయంలో ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.
‘కాంత లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. ఇకపై కూడా రాదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. ఇలాంటి మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ కాదు. నా కెరీర్ లో నిలిచిపోయే సినిమా ఇది’ అంటూ ఆసక్తిని పెంచాడు
రానా, దుల్కర్ ఇద్దరూ కలసి నిర్మించిన సినిమా ఇది. ఈ ఇద్దరికీ సినిమాపై మంచి అభిరుచి వుంది. ఈ కథ విన్నప్పుడే సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారట. ‘మాకు సినిమానే అన్నీ ఇచ్చింది. సినిమాకి తిరిగివ్వాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రేమతో చేసిన సినిమా కాంత. మేము క్రియేట్ చేసిన ప్రపంచం మీ అందరికీ అలనాటి రోజుల్లోకి తీసుకెళ్ళిపోతుంది’ అన్నారు.
ఈ సినిమా బియోపిక్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దుల్కర్ రానా ఇద్దరూ ఖండించారు. ”ఇది ఫిక్షనల్ స్టొరీ. కాకపోతే గొప్ప వ్యక్తులు చీకటి కోణం ఇందులో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు.

