బాల‌య్య కోసం క‌న్న‌డ విల‌న్‌

నంద‌మూరి బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర కోసం చాలా అన్వేష‌ణ జ‌రిగింది. సీనియ‌ర్ న‌టుడు అర్జున్ పేరు కూడా ప‌రిశీలించారు. ఇప్పుడు విల‌న్ గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్‌ని తీసుకొచ్చారు. ఈ సినిమాలో దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడిగా ఖాయ‌మైన‌ట్టు మైత్రీ మూవీస్ సంస్థ ప్ర‌క‌టించింది. దునియా విజ‌య్ తెలుగులో న‌టిస్తున్న తొలి చిత్ర‌మిదే.

అఖండ త‌ర‌వాత బాల‌య్య‌, క్రాక్ త‌ర‌వాత‌.. గోపీచంద్ మ‌లినేని చేస్తున్న సినిమా. ఇప్ప‌టికే దీనిపై భారీ అంచ‌నాలు మొద‌లయ్యాయి. సంక్రాంతి త‌ర‌వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ కెమెరామెన్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. ప‌క్కా మాస్ సినిమా కాబ‌ట్టి, ప‌వ‌ర్‌ఫుల్‌టైటిల్ కోసం అన్వేషిస్తోంది చిత్ర‌బృందం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close