దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ హైదరాబాద్ శివారులోని ఓ లగ్జరీ రిసార్టులో చేసుకుంటున్న పుట్టినరోజు పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. దివ్వెల మాధురి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి ఈ మెగా బర్త్ డే పార్టీ ఇస్తున్నారు. డీజేను ఏర్పాటు చేశారు. యూత్ స్టైల్లో అందరూ తాగి ఊగుతున్న సమయంలో పోలీసులు ఊడిపడ్డారు.
లిక్కర్ పార్టీకి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ తీసుకోలేదు. పైగా అక్కడ ఖరీదైన విదేశీ మద్యం పెద్ద మొత్తంలో దొరికింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ఎంట్రీతో డీజే, పార్టీ అక్కడితో ఆగిపోయింది. అయితే పోలీసులు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. కానీ దివ్వెల మాధురీ మాత్రం తాము వర్త్ పార్టీని హోస్ట్ చేయలేదని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
కుటుంబానికి చెందిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలకు పిలిస్తే వచ్చామని .. తాము ఈ పార్టీని ఏర్పాటు చేయలేదని వారు చెప్పారు. పార్థసారధి అనే వ్యక్తి పుట్టిన రోజు అని చెబుతున్నారు. మొత్తంగా లిక్కర్ పార్టీలో దంపతులు ఉండటంతో.. ఈ పార్టీ భగ్నం మీడియాలో వైరల్ అయింది.
