ఇంటర్వ్యూ : డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శకనిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడుగా దగ్గుబాటి రానా నటించిన ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కింది. ఈ భారీ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత గుణశేఖర్‌తో జరిపిన ఇంటర్వ్యూ…

T 360: ఈ చిత్రాన్ని 3డిలో చెయ్యడానికి రీజన్ ఏమిటి? దానివల్ల ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు?
గుణ శేఖర్: 3డి విషయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. అయితే సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా టాప్ టెక్నీషియన్స్ తో 3డి ఫార్మాట్‌లో చేయడం జరిగింది. టెక్నికల్‌గా సినిమా చాలా హై-స్టాండర్డ్ గా ఉండాలని ఎక్కువ టైమ్ తీసుకోవడం జరిగింది. ఇండియాలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. మా టెక్నీషియన్స్ సహకారంతో మేం అనుకున్న ఎఫెక్ట్ ని తీసుకురాగలిగాం.

T 360: రుద్రమదేవి సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే ప్రాజెక్ట్ అన్న నమ్మకం ఎలా కలిగింది?
గుణ శేఖర్: వాస్తవంగా ఈ సినిమాని గోన గన్నారెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే అది కమర్షియల్‌గా వర్కవుటవుతుందని కొందరు నిర్మాతలు సలహాలిచ్చారు. కానీ నాకు రుద్రమదేవి కథ మాత్రమే కనిపించింది. ఇంకా చెప్పాలంటే రుద్రమదేవి వీరత్వం, సెన్సిబిలిటీస్ కనిపించాయి. ఈ చిత్రం ఒక్కడును మించిన కమర్షియల్ సినిమా. రుద్రమదేవి కాలిబర్‌ని నమ్మి నేనే నిర్మాతగా సినిమాని ప్రారంభించాను. పెద్ద పెద్ద స్టూడియోల ఓనర్లు తీయాల్సిన చిత్రాన్ని నేను తీసే సాహసం చేశాను. నన్ను నేను అంత బలంగా నమ్మి చేశాను. టెక్నాలజీ పరంగానూ ఎంతో అప్‌డేట్ అయ్యాను.

T 360: రుద్రమదేవి కథను సినిమాగా తియాల్యన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది?
గుణ శేఖర్: ఆంధ్రా యూనివర్శిటీలో 8వ తరగతి చదివేటప్పుడు తెలుగు నాన్ డీటైల్‌లో రుద్రమదేవి పాఠం చదువుకున్నాను. అది జ్ఞాపకాల్లో నిక్షిప్తమై వుంది. చెన్నయ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బ్రేవ్ హార్ట్ అనే హాలీవుడ్ సినిమా చూశాను. అలాంటివి మనకు అరుదుగా వస్తాయి. 1960-70ల కాలం తర్వాత మనకి కొత్త జోనర్ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే ఓ డిఫరెంట్ జోనర్‌లో సినిమా తియ్యాలనిపించింది. రుద్రమదేవి కథతో సినిమా చెయ్యాలని అప్పుడే అనిపించింది.

T 360: ప్రాజెక్టు ఇంత ఆలస్యానికి కారణం?
గుణ శేఖర్: – ఈ కథని సినిమాగా తియ్యడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదు. అందుకే ఈ సినిమాకి నేనే నిర్మాతనయ్యాను. నిజానికి ఒక్కడు తర్వాత రుద్రమదేవి చిత్రం తీయాలనుకున్నా. ఆ తర్వాత ప్రీప్రొడక్షన్‌ మొదలైనా మధ్యలో నిర్మాతలు వర్కవుటవ్వదని వెనకడుగు వేశారు. 2004లో 20-25కోట్ల బడ్జెట్‌ని ఒక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాపై పెట్టలేమన్నారు. గోనగన్నారెడ్డి పాత్ర ఆధారంగా సినిమా తీస్తే కమర్షియల్‌గా వర్కవుటవుతుంది అని అన్నారు. కానీ నాకు అది నచ్చలేదు. రుద్రమదేవి కథకే ప్రాధాన్యతనిచ్చాను. నా దృష్టిలో రుద్రమదేవి కథే కమర్షియల్‌. ఒక్కడు విజయంతో సౌత్‌లోనే అత్యధిక పారితోషికం అందుకునే స్థాయిలో ఉండి.. డిఫరెంట్‌ ఆలోచన చేశాను. అయితే ‘ఒక్కడు’ తర్వాత అనూహ్యంగా గ్రాఫ్‌ తగ్గడం ఇబ్బంది పెట్టింది. రుద్రమదేవి ఆలోచనల వల్లే దర్శకుడిగా స్టక్‌ అయ్యాను. అందుకే ఆ తర్వాత డేర్‌ స్టెప్‌ వేసి నేనే సినిమాని నిర్మించాను. రుద్రమదేవి కథే నన్ను డ్రైవ్‌ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కడుని మించి పదింతలు కమర్షియల్‌ ప్రాజెక్టు ఇది.

T 360: భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నప్పుడు రిస్క్‌ అవుతుందేమోనని ఆలోచించలేదా?
గుణ శేఖర్: – కొత్త టెక్నాలజీని ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే ఎవరో ఒక్కరు రిస్క్‌ చెయ్యాల్సిందే. అప్పట్లో చూడాలని ఉంది సినిమాతో డిటిఎస్‌ని పరిచయం చేశాం. ఆరోజుల్లోనే డీటీఎస్‌ కోసం 25లక్షలు ఖర్చు చేయాల్సొచ్చింది. సినిమాలో శబ్ధాలు కాకుండా సౌండ్‌ సపరేట్‌గా డిస్క్ లో రన్ అవుతుందట. ఇది అవసరమా? అని అందరూ అన్నారు. అప్పటికి కేవలం నాలుగు థియేటర్లలోనే డీటీఎస్ సౌకర్యం ఉంది. నా నిర్మాత నమ్మి ఎంకరేజ్ చేయడం వల్ల డీటీఎస్‌ని విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇప్పుడు డీటీఎస్‌ లేని థియేటర్‌ చూపించగలరా? అలాగే ‘సైనికుడు’ సినిమాతో డీఐ (డిజిటల్ ఇంటర్మీడియట్‌)ని పరిచయం చేశాను. ప్రైమరీ కలర్‌తో పాటు సెకండరీ కలర్‌ని కూడా కంట్రోల్‌ చేసేది డిఐ. ఇప్పుడు డిఐ లేని సినిమాయే లేదు. కుట్టిచేతన్‌ లాంటి 3డి సినిమాని చిన్నప్పుడే చూశాం. 3డిలోనూ అప్‌డేట్‌ అయ్యాం. ఇప్పుడు డిజిటల్‌ 3డి వచ్చింది. దీనితో 2డిలో తీసిన సినిమాని 3డిలోకి కన్వర్ట్‌ చెయ్యవచ్చు. రుద్రమదేవి చిత్రాన్ని మాత్రం స్టీరియోస్కోపిక్‌ 3డిలో తియ్యడం జరిగింది.

T 360: 3డి టెక్నాలజీపై శిక్షణ పొందారని విన్నాం!
గుణ శేఖర్: 3డి విద్య కోసం లండన్‌లో క్రాస్‌కోర్స్ నేర్చుకున్నా. జర్మనీ వెళ్లి ట్రయల్ షూట్ చేశాను. ముందే పక్కాగా అవగాహన తెచ్చుకున్నాకే సెట్స్ కి వెళ్ళాం.

T 360: బాహుబలి వల్ల తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. అది మీకు ఎంతవరకు ప్లస్ అయ్యింది?
గుణ శేఖర్: వాస్తవానికి బాహుబలి చిత్రం కంటే ముందే రుద్రమదేవి చిత్రాన్ని స్టార్ట్ చేశాం. బాహుబలి రిలీజ్ అవ్వక ముందే రుద్రమదేవి బిజినెస్ కంప్లీట్‌ చేశాం. రుద్రమదేవిని నమ్మి ముందుకొచ్చిన వారికి కమిట్ అయి సినిమాని అమ్మేశాను. కానీ బాహుబలి తర్వాత మార్కెట్ రేంజ్ పెరిగింది. కమిట్‌మెంట్‌ వల్లే ముందు ఎవరికి అమ్మానో వారికే నా సినిమాని ఇచ్చాను. బాహుబలి ప్రభావంతో హిందీ వెర్షన్‌కి బిజినెస్ బాగా అయ్యింది. బాహుబలి దేశంలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ అంటూ ప్రచారమైంది. మా సినిమా విషయానికి వస్తే టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుండే సినిమాయే కాకుండా భారతదేశపు తొలి హిస్టారికల్‌ 3డి మూవీ.

T 360: రుద్రమదేవిగా అనుష్కనే మొదటి ఆప్షన్‌గా అనుకున్నారా?
గుణ శేఖర్: – రుద్రమదేవి అనుకోగానే ఆ పాత్రలో ఎవరు సరిపోతారు? అని వెతికాను. అనుష్క అయితే అరుంధతి ప్రభావం ఉంటుందని ఆలోచించా. కానీ చివరికి ప్రజల నుంచి అనుష్క అయితేనే బావుంటుందని స్పందన వచ్చింది. అలాగే గోనగన్నారెడ్డి పాత్ర కోసం మహేష్‌, ఎన్టీఆర్‌ ఎవరినీ సంప్రదించలేదు. ఇద్దరికీ ముందు నుంచి కథ తెలుసు. ఆసక్తి ఉందని చెప్పారు. కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈలోగానే మీడియాలో ప్రచారం అయిపోయింది. ఆ తర్వాత బన్ని తనంతట తానుగానే ఆసక్తి ఉందని ముందుకు వచ్చాడు. బన్ని ఓ మూవీ లవర్‌. నేను ఈ ప్రాజెక్టులో ఉంటాను. ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ‘వరుడు’ లాంటి ఫ్లాప్‌నిచ్చినా నా పనితనంపై నమ్మకంతో ఆ అవకాశం ఇచ్చాడు. రేసుగుర్రం లాంటి హిట్ కొట్టాక.. “ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నాను..పిలిస్తే చాలు..” అన్నాడంటే అది బన్ని గొప్పతనం. బన్ని ఓ చట్రంను దాటి, ఇమేజ్‌ని వదిలి ఈ పాత్రలో నటించాడు.

T 360: 70 కోట్ల భారీ బడ్జెట్ మూవీని ఎలా చెయ్యగలిగారు?
గుణ శేఖర్: అందరూ అనుకుంటున్నదేమిటంటే గుణశేఖర్‌కి ఏదో నిధి దొరికింది. అందుకే అంత భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నాడు అని. అవును. నాకు నిధి దొరికింది. నాకు దొరికిన గుప్తనిధి రుద్రమదేవి కథే. ఈ కథను నమ్మే 80 కోట్ల బడ్జెట్ ఈ సినిమాపై పెట్టగలిగాను.

T 360: స్టీరియోస్కోపిక్ 3డి ప్రత్యేకత?
గుణ శేఖర్: – స్టీరియోస్కోపిక్ 3డి అంటే షూట్ చేసేడప్పుడే 3డిలో చేయాలి. మామూలుగా 2డి సినిమాల్ని 3డిలకు మార్చడం వంటిది ఈ ఫార్మాట్‌లో కుదరదు. స్టీరియో స్కోపిక్‌ 3డికి రెండు కెమెరాలు ఒకేసారి పనిచేస్తాయి. ఎడమ కన్ను, కుడి కన్ను .. రెండింటికి రెండు లెన్సులు వేయాలి. రెండు ఫ్రేముల్ని మెర్జ్‌ చేసి ఒకేసారి చిత్రీకరిస్తారు. 2డి నుంచి 3డి కన్వర్షన్‌ చేసిన దానికంటే ఇలా తీసిన 3డి హైలీ క్వాలిటీతో కనిపిస్తుంది.

T 360: రుద్రమదేవి జీవిత కథను ఎక్కడి నుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించారు?
గుణ శేఖర్: – రుద్రమదేవి పుట్టుక నుంచి సినిమా ఉంటుంది. ఆమె పరిపాలనలో ఒక గ్రాండ్ విక్టరీగా ఉంటుంది. అక్కడే సినిమాని ఎండ్ చేశాం. 13వ శతాబ్దం నాటి నాటి పరిస్థితుల్ని, సౌత్‌లో సింహభాగాన్ని పాలించిన కాకతీయుల చరిత్రను, రుద్రమదేవి వీరత్వాన్ని ఈ సినిమాలో చూపించాను. 2 గంటల 38 నిముషాల్లో రుద్రమదేవి కథ, కాకతీయుల చరిత్ర మొత్తాన్ని తియ్యడం అనేది సాధ్యం కాని విషయం.

T 360: ఈ పయనం సాహసం అనిపించలేదా?
గుణ శేఖర్: ఎవిఎం స్టూడియో, పద్మాలయా స్టూడియో లాంటి సంస్థలు తీయాల్సిన సినిమా ఇది. నేనొక సాధారణ టెక్నీషియన్‌ని. నేను ఈ సినిమా తియ్యడం అంటే సాహసమనే చెప్పాలి. రుద్రమదేవి కథ డ్రైవ్ చేయడం వల్లే ఈ సినిమా తీశాను. దీనికి ఇళయరాజా, శ్రీకర్‌ప్రసాద్, నీతా లుల్లా వంటి టాప్ టెక్నీషియన్స్ తోడవడం వల్ల సినిమా నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది,” అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎఫ్3 లో అందరి హీరోల ఫ్యాన్స్ కోసం స్పెషల్ బ్లాక్

ఎఫ్2 ఎవరూ ఊహించని విజయం అందుకుంది. ఈ విజయం చిత్ర యూనిట్ కి గ్రేట్ ఎనర్జీగా పని చేసింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ లో సినిమాలు వస్తూనే ఉంటాయని నిర్మాత దిల్ రాజు...

రెండు, మూడు నెలల్లో కేసీఆర్ “సంచలన వార్త”

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరులో ప్రకటించారు. దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందని .. జరుగుతందని ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిసిన...

మూఢ నమ్మకాలు నమ్మను.. టెక్నాలజీని నమ్ముతా : మోదీ

తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీ కేసీఆర్ నమ్మకాలపై సెటైర్లు వేశారు. తాను మూఢనమ్మకాలను నమ్మి పనులు చేయబోనని.. తాను టెక్నాలజీని నమ్ముతానన్నారు. ఐఎస్‌బీ ఇరవయ్యో వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో...

ఇక రేవంత్‌కు రెబల్ మధుయాష్కీ..ఘాటు లేఖ !

ఎవరైనా పార్టీ వేదికల మీదేమాట్లాడాలి.. బయట మాట్లాడొద్దు.. ఎంతటి వారినైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటకు గెంటేస్తానని స్వయంగా రాహుల్ గాంధీ హెచ్చరించి వెళ్లారు. కానీ ఆయన మాటలను గట్టిగా వారం రోజులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close