తెలంగాణలో భూప్రకంపనలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం భూమి కంపించింది. కరీంనగర్ , సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లోని భూమి స్వల్పంగా కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల అయితే పరుగులు తీశారు. ప్రధానంగా చొప్పదండి, రామడుగు, గంగాధర, మండలాల్లో రెండు సెకన్ల పాటు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
మరోవైపు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కూడా భూమి కంపించింది. కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్చాందా మండలాలతోపాటు కమ్మర్ పల్లి ,మోర్తాడ్ మండలాల్లోనూ భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది.