ప్లాన్ రివర్స్ – పోలింగ్ బూత్ ఇంచార్జులుగా టీచర్లే

ఆంధ్రప్రదేశ్ లో టీచర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచేందుకు జగన్ రెడ్డి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు గండిపడింది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రారంభించారు. సీఈవో ఆదేశాలతో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఆ వివరాలను శుక్రవారం ఉదయం 11 గంటల లోగా సీఈవోకు పంపనున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావించారు.

దీంతో అసలు సిబ్బందిపై చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశంపైనా చర్చించారు. వారిని తీసుకున్నా సిబ్బంది సరిపోరని తేలడంతో టీచర్లను నియమించాలని ఆదేశించారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నారు. అంటే.. పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు. టీచర్లే ఇంచార్జులుగా ఉంటారు కాబట్టి జగన్ రెడ్డి ప్లాన్ పూర్తి రివర్స్ అయినట్లవుతుంది.

ఒక్క టీచర్లు కాదు ఏపీలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఏ ఒక్క ఉద్యోగి సంతృప్తికరంగా లేరు. అయినా టీచర్లు ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని.. చట్టం కూడా తీసుకు వచ్చారు. ఆ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు. ఇది తెలిసి కూడా చేశారు. చివరికి టీచర్ల చేతుల్లోకే ఎన్నికల విధులు వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close