బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్ని ఉద్ధరిస్తానని బయలుదేరిన ప్రశాంత్ కిషోర్ బెంగాల్ లోనూ తన పేరు ఓటర్ గా నమోదు చేసుకున్నారు. దీంతో ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. బిహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాల్లో నమోదై ఉందన్న ఆరోపణలపై మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
భారత ఎన్నికల చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధం. ఈసీ ఈ విషయంపై కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రశాంత్ కిషోర్ బిహార్లోని భభువా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉన్నారని. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోనూ ఆయన పేరు ఓటరు జాబితాలో ఉంది.
మూడు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారు. అయితే ఎక్కడి పేరు తొలగిస్తారన్నది ఆసక్తికరం. గతంలో ఆయన టీఎంసీ కోసం స్ట్రాటజిస్టుగా పని చేశారు. ఆ సమయంలో అక్కడ ఓటు నమోదు చేసుకున్నారేమో కానీ స్వరాష్ట్రంలో ఓటు ఉన్న సంగతి మర్చిపోయారు.
ఇంకా ప్రశాంత్ కిషోర్ లేదా జన్ సురాజ్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
