రూ. 17 కోట్ల 51 లక్షల్లో రూ. 17 కోట్లు ఎక్కడికి పోయాయి..?

కొండగల్ నియోజకవర్గం శివారులో మీర్జాపూర్ అనే ఊరి దగ్గర ఫామ్ హౌస్ ఉంది. తెల్లవారుజామున ఐటీ అధికారులు బృందం ఉరుములేని పిడుగులా. .. ఆ ఫామ్ హౌస్‌పై దాడి చేసింది. అంతే.. అక్కడ ఉన్న వాళ్లంతా బిత్తరపోయారు. తమ దగ్గరకు ఎవరైతే రారనుకున్నారో.. వాళ్లే వచ్చే సరికి కంగారు పడిపోయారు. కానీ.. వాళ్లు మొత్తం సోదాలు చేసి… పెద్ద పెద్ద పెట్టెల్లోనే సొమ్ము తీసుకెళ్లారు. వారు వచ్చిన విషయం తెలుసుని చాలా ఫోన్లు హుటాహుటిన వెళ్లాయి. అంత జరిగినా… సాయంత్రం వరకూ విషయం బయటకు పొక్కలేదు. విషయం తెలిసిన తర్వాత గగ్గోలు రేగింది. కోట్లే పట్టుకుపోయారని.. అంతా అధికార పార్టీకి కాబట్టే.. గూడుపుఠాణి కోసం సైలెంట్ గా ఉంచారని విమర్శలు వచ్చాయి. అక్కడ రూ. 15 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారని.. మరికొన్ని కోట్ల రూపాయల పంపిణీకి సంబంధించిన లెక్కల పుస్తకం కూడా దొరికిందని చెప్పుకున్నారు. ఈ విషయం.. ఆ నోటా.. ఈ నోటా పడి.. జర్నలిస్టులు… ఏకంగా రజత్ కుమార్ నే అడిగేశారు. దానికి ఆయన.. నిజమే… సీల్డ్ కవర్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది … అది తర్వాతి రోజు సీల్ తీస్తాం.. అని చెప్పుకొచ్చారు. అప్పటికే సీన్ అందరికీ అర్థమైపోయింది. తెర వెనుక ఒత్తిళ్లు.. ఓ రేంజ్ లో ఉన్నాయని. నిజానికి ఎన్నికల దాడుల్లో ఇలాంటి వేమైనా జరిగి.. స్పాట్ లో వివరాలు బయటపెడతారు.. సీల్డ్ కవర్ లో పంపరు. కానీ సీల్డ్ కవర్ సంప్రదాయాన్ని రజత్ కుమార్ ప్రారంభించారు. కానీ.. అప్పటికే.. బయటకు వచ్చేసింది. రూ. 17 కోట్ల యాభై ఒక్క లక్షలు పట్టుకున్నారని.. రూ. 51 లక్షలు మాత్రమే లెక్క చూపించబోతున్నారనేది…. ఆ సమాచరం. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అదే చెబుతున్నారు. రూ. 17కోట్ల 51 లక్షలు దొరకాయని…నేరుగా మహేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో నిజానిాలు ఎప్పటికీ బయటకు రావు. కానీ.. ఈసీ తీరు.. ఐటీ అధికారులు వ్యవహరం.. సోదాల విషయాన్ని రోజంతా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం.. బయటకు పొక్కిన తర్వాతే మీడియాకు చెప్పడం లాంటి వన్నీ చూస్తే.. కచ్చితంగా… సమ్ ధింగ్… సమ్ థింగ అని అనుకోక తప్పదు. అదే.. ఇతర విపక్ష పార్టీకి చెందిన నేత ఇంట్లో.. ఈ తరహా దాడులు జరిగితే.. పరిస్తితి ఎలా ఉండేదో… తెలంగాణలో అందరూ ఊహించగలరు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close