ఇంత తేడా ఆమోదయోగ్యం కాదు-వరల్డ్ ఎకనమిక్ ఫోరం

*132 దేశాల్లో ఆకలి కేకలు
*ఎటుచూసినా గానుగెద్దు జీవితాలు
*62 మంది చేతుల్లో ప్రపంచంలో సగం సంపదలు

ప్రపంచంలో సగంమంది జనాభా సంపదకు సమానమైన సంపద మొత్తం కేవలం 62 మంది వద్దే ఉందనేది ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – డబ్ల్యుఇఎఫ్‌) వెల్లడించింది….అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 370 కోట్ల మంది ప్రజలు రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, శ్రమించి సంపాదించిన మొత్తానికి సమానమైన మొత్తం వారి వద్ద పోగు పడింది. ఈ పరిణామం పట్ల ఫోరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. “ఒక బస్సులో వెళ్లేంత మంది వద్ద ఇంత సంపద ఉండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ఆ సంస్థ అంతర్జాతీయ డైరెక్టర్‌ విన్నీ బ్యాన్‌యిమా వ్యాఖ్యానించారు.

2010 కంటే వారి సంపద సగాని కన్నా ఎక్కువే పెరిగిందని, అదే సమయంలో ప్రపంచ జనాభాలో సగం మంది నిరుపేదల ఆస్తి 68,00,000 కోట్ల రూపాయలు తగ్గిపోయిందని ఈ నివేదిక పేర్కొంది.

ఆక్స్‌ఫామ్‌ అనే హక్కుల సంఘం చేసిన సర్వే ఆధారంగా డబ్ల్యుఇఎఫ్‌ వెల్లడించిన ఈ సత్యాలు ఇప్పటిదాకా కార్పొరేట్‌ మేధావులు చెబుతున్న మాటలలోని డొల్లతనాన్ని బట్టబయలు చేశాయి. ప్రపంచీకరణ, మార్కెట్‌ వ్యవస్థలతోనే అసమానతలు తొలగుతాయని, సమానత్వం సాధ్యమవుతుందని చేస్తున్న ప్రచారమే దీనికి నిదర్శనం. అసమానతలే పునాదిగా, శ్రమ దోపిడీయే ఊపిరిగా మనుగడ సాగిస్తున్న వ్యవస్థకు అంతరాలు తొలగించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు మాత్రం దాటవేతే సమాధానంగా వస్తుంది.

నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతరాల దొంతర ఇలా బట్టబయలు కావడం ఇదే మొదటిసారి కాదు! ఇప్పటికే ఎన్నో నివేదికలు, ప్రపంచ వ్యాప్తంగా సాగిన పరిశీలనలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. అత్యధిక ప్రజల కష్టార్జితం కొద్ది మంది వద్ద పోగుపడటమే ఆ వ్యవస్థ లక్షణం. పారిశ్రామిక విప్లవం తరువాత ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, యుద్ధాలు, మానవ మారణ హోమం, చిన్నారులను చిదిపేసిన అకృత్యాలు చాటిచెప్పిన సత్యం ఇదే!

ప్రపంచ జనాభాలో సగానికి పైగా చాలీచాలని జీతాలతో, ఏటికేడాది కుదించుకుపోతున్న ఆదాయాలతో, ఆకలితో, పస్తులతో రోజులు గడుపుతున్న దుస్థితిని పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించింది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం 52 దేశాల్లో ఆహార సమస్య తీవ్రంగా ఉంది. 117 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 80 దేశాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నట్లు తేలడం గమనార్హం.

ఆకలి కేకలు ఇలా వుంటే…2000 సంవత్సరంతో పోలిస్తే ఎంతో మెరుగు పడిందంటూ కార్పొరేట్‌ విశ్లేషకణలు వెల్లడౌతూండటం, సగం సత్యమే! మార్కెట్‌ మాయాజాలంలో భాగమే! భారతదేశమూ దీనికి మినహాయింపు కాదు. కాగితాలపై లెక్కలతో వాస్తవాలకు మసి పూసి, పేదరికం తగ్గిందంటూ మన పాలకులూ పదే పదే చెప్పుకోవడమూ ఈ విన్యాసంలో భాగమే!

పెట్టుబడులపై లాభాల కోసం మనుషుల్ని మరబొమ్మలుగా, జీవితాల్లో గానుగెద్దులుగా మార్చి వేసే ఈ ఆర్ధిక విధానం తీరే దుర్మార్గం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘RRR’ ఫ్లాప్ అయితే పండ‌గేనా?

ఆర్జీవీ అంతే. ఎక్క‌డ కెలకాలో అక్క‌డ కెలుకుతాడు. పైగా త‌న సినిమా విడుద‌ల అవుతుంటే... ఆ కెలుకుడు కార్య‌క్ర‌మం ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. `క్లైమాక్స్‌` అనే సినిమాని ఇప్పుడు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నాడు...

ఆర్‌జీవీ… రీ రిలీజ్‌!‌

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా 'క్లైమాక్స్‌' సినిమాని విడుద‌ల చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సాయింత్రం నుంచే ఆ ర‌చ్చ మొద‌లు కానుంది. ఈ సినిమా చూడాలంటే వంద రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది. ఈ వ్యాపారం గిట్టుబాటు...

మీడియా వాచ్ : ఈనాడులో ఉద్యోగాలు సేఫ్.. జీతాలు కట్..!

దశాబ్దాలుగా ఎదురు లేకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈనాడు ఎప్పుడూ ఎదుర్కోనంత ఆర్థిక పరమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వనరులన్నీ తగ్గిపోగా.. నెలవారీ లోటు కోట్లలోనే ఉంటోంది. అదే సమయంలో......

‘పుష్ష‌’లో… స్టార్ల హంగామా

టాలీవుడ్ కి పాన్ ఇండియా మోజు ప‌ట్టుకుంది. అయితే.. పాన్ ఇండియా ప్రాజెక్టు అంత ఈజీ కాదు. బోలెడ‌న్ని హంగులుండాలి. అన్ని భాష‌ల‌కూ, అన్ని ప్రాంతాల‌కూ న‌చ్చే క‌థ‌లు ఎంచుకోవాలి. దానికి త‌గ్గ‌ట్టు...

HOT NEWS

[X] Close
[X] Close