లాక్‌డౌన్ కొనసాగింపు సరే..! మరి ఆర్థిక వ్యవస్థ మాటేమిటి..?

లాక్‌డౌన్ కొనసాగించాలనే డిమాండ్లు కేంద్రానికి ఎక్కువగా వస్తున్నాయి. రాజ్‌నాథ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ అదే సిఫార్సు చేసింది. అదే సమయంలో.. ముఖ్యమంత్రులు అదే కోరుతున్నారు. శనివారం ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంగా.. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుపై ఎలాంటి వ్యతిరేకతతో లేదు. కానీ.. ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందనే.. ఉన్నత స్థాయి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటోంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలన్నీ మూత పడ్డాయి. అత్యవసర సర్వీసులు మాత్రమే.. అరకొరగా నడుస్తున్నాయి. ఫలితంగా.. 90 శాతం మనీ సర్క్యూలేషన్ ఆగిపోయింది. ప్రభుత్వాలకు ఆదాయం లేదు.

దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే అంటున్నాయి. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే.. ఇప్పటి వరకూ పడిన కష్టం వృధా పోతుందని చెబుతున్నారు. ప్రజలు అందరూ ఒక్క సారే రోడ్ల మీదకు వస్తే.. వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే.. ఎక్కడా వైరస్ కంట్రోల్‌లోకి వచ్చిన సూచనలు కనిపించడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో లాక్ డౌన్ ఎత్తివేయడం ప్రమాదకరం అని ఇప్పటికే కేంద్రానికి కూడా నివేదికలు వెళ్లాయి. లాక్ డౌన్ కొనసాగిస్తే ప్రజలు సహకరిస్తారా లేదా … సంశయం ప్రధానంగా ప్రభుత్వాలను పట్టి పీడిస్తోంది. భారత్ లాంటి దేశాల్లో 90 శాతం కుటుంబాలకు.. ఒక్క నెల ఆదాయం రాకపోయినా పరిస్థితి తలకిందులవుతుంది.

లాక్ డౌన్ కొనసాగిస్తే .. వీరందరూ.. ఓపిక పట్టడం కష్టం. ఇప్పటికే మూడు వారాల పాటు పనుల్లేకుండా ఇంటి పట్టునే ఉండిపోయారు. ప్రభుత్వం బియ్యం, పప్పు పంపిణీ చేసినా.. ఆ సాయం సరిపోదు. అందుకే.. కేంద్రం సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు.. మానసికంగా ప్రజల్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజల్ని సహకరించాలని కోరుతున్నాయి. వీటికి భిన్నమైన మార్గంగా.. వైరస్ వ్యాప్తి చెందని ప్రాంతాల వరకూ మినహాయింపులిచ్చి.. రెడ్ జోన్లలతో మాత్రం లాక్ డౌన్ కొనసాగిస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఆదివారం.. సాయంత్రం.. నరేంద్రమోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

HOT NEWS

[X] Close
[X] Close