మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రంగంలోకి ఈడీ !

టాలీవుడ్ ప్రముఖుల్ని డ్రగ్స్ కేసు నిను వీడని నేనే అన్నట్లుగా వెంటపడుతోంది. ఓ సారి తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రచ్చ రచ్చ చేసి.. చివరికి ఏదో విధంగా మ..మ అనిపించి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. వారు పెట్టిన కేసుతో ఈడీ ఓ సారి రంగంలోకి దిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం .. ఎక్సైజ్ శాఖ ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆధారాలన్నీ ఈడీ అధికారులకు ఇవ్వాలని తెలంగాణ డ్రగ్స్ కేసు విచారణ అధికారులను ఆదేశించడం కొత్త సంచలనానికి కారణం అవుతోంది.

డ్రగ్స్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు కాక ముందే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో దాఖలు చేసిన ఆ పిటిషన్ పై ఇప్పటికీ విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడంలేదనీ.. ఇందులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు రేవంత్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జేడీ కూడా కోర్టుకు అదే తెలిపారు. ఈ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు. దీంతో ఆధారాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేసిన 15 రోజుల్లో డ్రగ్స్‌ కేసులో కాల్‌డేటా, రికార్డులను నెల రోజుల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. రేవంత్‌ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది. అయితే కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వద్ద ఉన్న సమాచారం ఈడీకి, కోర్టులకు ఇచ్చామని స్పష్టం చేసింది. ప్రభుత్వం దీనికే కట్టుబడితే కేసు తేలిపోతుంది.. రికార్డులన్నీ ఇస్తే ఈడీ మళ్లీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close