హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ చైర్మన్ జగన్మోహన్ రావుపై ఈడీ కేసు కూడా నమోదు కానుంది. ఆయన రెండేళ్లలో 170 కోట్లకుపైగా అవినీతి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే చైర్మన్ తో పాటు సభ్యులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక నుంచి తవ్వితే చాలా బాగోతాలు .. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా బయటపడనున్నాయి.
అసలు జగన్ మోహన్ రావు హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి అర్హత లేదు. ఓటింగ్ రైట్స్ లేని క్లబ్ తరపున ఆయన పోటీ చేశారు. అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు.. ఇతర రాజకీయాలతో ఆయన గెలిచారు. తప్పు చేసిన గెలిచి ప్రభుత్వం మారినా ఆయన మారలేదు. ఐపీఎల్ టీమ్ ను వేధించారు. వేల టిక్కెట్లు ఉచితంగా తీసుకుని బ్లాక్ లో అమ్మాలనుకున్నారు. కానీ దొరికిపోయారు. ఇప్పుడు మొత్తం చరిత్ర బయటకు వచ్చేస్తోంది.
హెచ్ సీఏలో ఎప్పుడూ వ్యవహారాలు సక్రమంగా జరగలేదు. అజహర్ ఉన్నప్పుడు కూడా లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసులు ఉన్నాయి. ఈడీ కేసు కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రావుపైన. క్రికెట్ పేరుతో … పాలకవర్గం చేసే దోపిడీని ఎవరూ ఆపలేకపోతున్నారు.