వైఎస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఇంట్లో నోట్ల కట్టల గుట్ట బయటపడింది. మొత్తం 9 కోట్లు ఐదు వందల నోట్లు దొరికాయి. అంతేనా..
8 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆభరణాలతో కలిపి మొత్తం 23 కోట్ల రూపాయల విలువచేసే నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వైఎస్ రెడ్డి పేరుతో ఏదో తేడా ఉంది కానీ.. ఆయన వారితో సంబంధం ఉన్న వారో కాదో స్పష్టత రావాల్సి ఉంది. ఈ వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలపై ఈడి కేసు నమోదు చేసింది. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఈ డి నగదు, నగలు స్వాధీనం చేసుకుంది.
వైఎస్ అనే పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చాలా అవినీతి కేసులు ఉన్నాయి. ఇలాంటి పేరును పెట్టుకుని ముంబైలోనే టౌన్ ప్లానింగ్ శాఖను దున్నేశాడు ఈ అధికారి. ఇప్పుడు దొరికిపోయాడు. పేరును నిలబెట్టాడు.