ఆయ‌న `క‌త్తెర` మాట్లాడుతుంది

తెల్ల‌ని బ‌ట్ట‌లు,జుల‌పాల జుత్తు.. ఎప్పుడూ మొహంపై చెర‌గ‌ని చిరున‌వ్వు…

గౌత‌మ్ రాజు అంటే గుర్తొచ్చే రూపం ఇది. `ఎడిటింగ్ – గౌతంరాజు` అని కొన్ని వంద‌ల సినిమాల్లో చూసి ఉంటారు జ‌నం. ఎడిట‌ర్ల‌లో ఆయ‌న తొలి స్టార్ అనుకోవ‌చ్చు. దాదాపు 800 చిత్రాల‌కు ఎడిటింగ్ చేశారాయ‌న‌. మూడు ద‌శాబ్దాల‌కు పైగానే చిత్ర‌సీమ‌కు త‌న సేవ‌లందించారు. గౌత‌మ్ రాజు వ‌చ్చాక‌.. సినిమా `క‌టింగ్‌`లో చాలా మార్పులొచ్చాయి. వేగం పెరిగింది. నిజానికి ఎడిట‌ర్ ఎంత ప‌ని చేయ‌గ‌ల‌డు? ఓ సినిమా విజ‌యం వెనుక ఎడిట‌ర్ బాధ్య‌త ఎంత ఉంటుంది? అనేది తెలుగు సినిమాకి గౌత‌మ్ రాజు వ‌చ్చాకే ఆగా అర్థ‌మైంది. ఇది వ‌ర‌కు ద‌ర్శ‌కుడు ఏఆర్డ‌ర్‌లో చెబితే.. ఆ ఆర్డ‌ర్ లో.. సినిమాని క‌త్తిరించేవారు. కానీ.. గౌత‌మ్ రాజు మాత్రం.. ర‌షెష్ అంతా చూశాక‌, క‌థ మొత్తం విన్నాక `ఈ క‌థ‌ని ఈ ఆర్డ‌ర్ లో క‌ట్ చేస్తే బాగుంటుంది` అంటూ.. త‌న‌దైన టెక్నిక్ వాడేవారు. ఒక్కోసారి.. ఎడిట్ అయిన త‌ర‌వాత‌.. సినిమా మొత్తం చూసుకుంటే.. `ఇది మ‌న సినిమానేనా` అని ద‌ర్శ‌కులు కూడా షాక‌య్యేవారు. ముందున్న సీన్ వెనుక పెట్టి, వెనుకున్న సీన్ ముందుకు తీసుకురావ‌డం వ‌ల్ల‌.. ఒక్కోసారి సినిమా స్పీడే మారిపోతుంది. గౌత‌మ్ ఇలాంటి మ్యాజిక్ చాలాసార్లు చేసేవారు. అందుకే గౌత‌మ్ రాజుని న‌మ్మి, ఆయ‌న‌కు సినిమాని అప్ప‌జెప్పేసేవారు ద‌ర్శ‌కులు. `ఈ సినిమాలో ఇలాంటి సీన్ ఉంటే బాగుంటుంది… ఎమోష‌న్ స‌రిపోలేదు. ఇక్క‌డ ఇంకో డైలాగ్ కావాలి..` అంటూ ద‌ర్శ‌కుల్ని, రైట‌ర్ల‌ని పిలిపించి మ‌రీ.. త‌న అభిప్రాయాలు చెప్పేవారు. గౌత‌మ్ రాజు చెప్పారంటే. అది విలువైన పాయింటే అని ద‌ర్శ‌కులూ న‌మ్మేవారు. అలా చాలా సినిమాల జాత‌కాల్ని మార్చారు గౌత‌మ్ రాజు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న చాలామంది ఎడిట‌ర్లు ఆయ‌న శిష్యులే. కాక‌పోతే.. ఆయ‌న‌కు మీడియా అంటే చాలా సిగ్గు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఒక్క ఇంట‌ర్వ్యూ కూడా ఇవ్వ‌లేదు. క‌నీసం ఆడియో ఫంక్ష‌న్ల‌లోనూ మాట్లాడేవారు కాదు. ఓ ర‌కంగా ఆయ‌న మౌన‌ముని. ఆయ‌న మాట్లాడ‌క‌పోయినా.. ఆయ‌న క‌త్తెర మాట్లాడుతూనే ఉంటుంది. ఇంత అనుభ‌వ శీలి, ఎడిటింగ్‌లో తెలుగు సినిమాకు కొత్త పాఠాలు నేర్పిన గురువు.. లేక‌పోవ‌డం, స‌డ‌న్‌గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం నిజంగా బాధాక‌రం. ఆయ‌నకు తెలుగు 360 ఘ‌న‌మైన నివాళి అర్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close