ఎడిటర్స్ కామెంట్ : “స్టాలిన్” నేర్పుతున్న పరిపాలనా పాఠాలు..!

” భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అర్పించాలని కోరుకుంటారు కానీ మన ఇంట్లో పుట్టాలని ఎవరూ కోరుకోరు..!” ” దేశం కోసం ప్రాణాలు అర్పించే యువత ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, అలా ముందుకు వచ్చే వీరుడు తమ ఇంట్లో పుట్టాలని మాత్రం ఎవరూ కోరుకోరు..” అంత ఎందుకు ” రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతూంటే అడ్డుకున్న వారిని అభినందించడానికి సిద్ధపడతారు కానీ తాము మాత్రం అలాంటి దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు..” ఇది సమాజం పోకడ. సహజం. కానీ తాము అభినందిస్తున్నాం.. తాము గొప్పగా చెబుతున్నాం.. తాము ఎంతో విలువలతో కూడిన వ్యవహారాలుగా పరిగణిస్తున్నామని బయట ప్రపంచానికి చెబుతారు కానీ.. వారు మాత్రం ఆచరించాలనే ఆలోచనకు రారు. అక్కడే వ్యవస్థలో అసలు లోపం బయట పడుతుంది. పడుతోంది కూడా. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్‌ పాలనా శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలకు కారణం అవుతోంది. చిన్నా చితకా లీడర్లు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక చిరంజీవి లాంటి వాళ్లు అయితే నేరుగా వెళ్లి అభినందనలు తెలిపి వస్తున్నారు. స్టాలిన్ చేస్తున్న పనులు అంత ఆదర్శమైనప్పుడు.. మిగతా వారు అందరూ ఎందుకు చేయడం లేదు..? ఎక్కడ ఉంది లోపం..?

గొప్ప సంస్కరణలు అమలు చేస్తున్నారని స్టాలిన్‌కు ప్రశంసలు..!

అసెంబ్లీలో తనను పొగిడితే చర్యలు తీసుకుంటానని తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్మోహమాటంగా తన ఎమ్మెల్యేలకు చెప్పారు. రాజకీయాల్లో పొగడ్తలు ఎలా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. అయితే పొగడ్తలకు పడిపోని ఆడవారు.. రాజకీయ నేతలు ఉండరంటే అతిశయోక్తి కాదు. పైగా తమిళనాడు అంటే వ్యక్తి పూజకు నిలయం. అక్కడ రాజకీయాలన్నీ వ్యక్తుల చుట్టూనే తిరుగుతూంటాయి. ఆ వ్యక్తిని పూజించడానికి అందరూ సాష్టాంగ నమస్కారాలు చేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి రాజకీయ కల్చర్ నుంచి నుంచి వచ్చిన స్టాలిన్ మొత్తం బ్రేక్ చేసేశారు. తన గురించి ఎక్కడైనా పొగిడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. స్టాలిన్ తన ఎమ్మెల్యేలకు చేసిన హెచ్చరికలు తెలుగు రాష్ట్రాల్లోనూ హైలెట్ అయ్యాయి. అదే మన రాష్ట్రంలో అయితేనా అని .. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు కూడా రివైండ్ చేసుకుని ఉంటారు.

ఇక్కడ నువ్ అనుకుంటే అవుద్ది సామీ అంటూ ఎమ్మెల్యేల స్క్రిప్టింగ్ పాట్లు..!

ఏపీ సీఎం జగన్ మొదటి సారి అసెంబ్లీలో సీఎం హోదాలో వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలు ఆయనను ఇంప్రెస్ చేయడానికి స్కిట్లను స్క్రిప్ట్ మీద రాసుకొచ్చారు. ఓ ఎమ్మెల్యే సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా వచ్చి ” నువ్ అనుకుంటే అయిపోద్ది సామీ” వంటి సినిమా డైలాగులు చెప్పి వెగటు పుట్టించారు. ఇక రోజా, పాముల పుష్పశ్రీవాణి, బియ్యపు మధుసూదన్ రెడ్డి వంటి వారి పొగడ్తలకు చూసే వాళ్లంతా పగలబడి నవ్వుతారు. సీఎం జగన్‌ కు కూడా వాటిని నవ్వు వస్తుంది. కానీ అ నవ్వు ఉద్దేశం వేరు. ఎక్కడా కాస్త అతి అనిపిస్తోదంని అనుకోరు.. పొడిగే కొద్దీ పొగిడించుకోవాలనుకుంటారు. అందుకే ఇప్పుడు ఏపీలో జగన్ కోసం ఏకంగా గుళ్లే కట్టేశారు. ఇక రోజువారీ జగన్ గురించి చెప్పే పొగడ్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్‌ను ఎలా పొగడాలో రచనల కొంత మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పీఆర్వోల పేరుతో స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకున్నారంటే నిజమా అని ఆశ్చర్యపోక మానరు.

ఎవరైనా పొగడ్తలకు దాసోహమే..!

ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అంతే. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌నూ పొగడటానికి టీఆర్ఎస్ నేతలు పడే పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎవరు ఎక్కువగా పొగుడుతారో వారే విన్నర్లు. అలాంటి వారికి అవకాశాలు వస్తాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి పొగడ్తలను టీఆర్ఎస్ అధినేత విశ్వాసంగా చూస్తారు. ఆ కొలమానమే ముఖ్యంగా కాబట్టి పొగిడేందుకు అసెంబ్లీనా .. తెలంగాణ భవనా అన్న తేడా చూపించరు. ముందు మైక్ కనిపిస్తే కేసీఆర్‌ను వేనోళ్ల పొగిడి ఆ తర్వాత మాత్రమే గొంతు సవరించుకుంటారు. అయితే అటు ఏపీ సీఎం ను.. ఇటు కేసీఆర్‌ను పొడుగుతున్న వారు.. ఆహా ఓహో అనుకుంటున్న సామాన్యులు స్టాలిన్‌ను అద్భుతమైన వ్యక్తి అని పొగుడుతారు. కానీ తమ అభిమాన సీఎంలు చేస్తున్నదాన్ని.. తమ అభిమాన పార్టీ నేతలు చేస్తున్న దాన్ని మాత్రం తప్పు పట్టరు. స్టాలిన్ చేసింది కరెక్టేనంటారు కానీ.. తమ వారు స్టాలిన్ చేయవద్దనే పనిని చేస్తే అదే గొప్పనుకుంటారు. అంటే.. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయంలో ఓ మంచి పద్దతి తెస్తే శభాష్అంటారు కానీ తమ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదా మరో నేత అలా ఉంటే యాక్సెప్ట్ చేయలేరు. అంత వరకూ ఎందుకు అద్భుతమైన పాలన అందిస్తున్నారని చిరంజీవి నేరుగా వెళ్లి అభినందించారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పెట్టారు. కానీ వీరు పొగడ్తలకు దూరమా..? బండ్ల గణేష్ అనే వ్యక్తి వీళ్లను ప్లీజ్ చేయడానికే పొగుడుతారని స్పష్టంగా తెలుసు.. పొగిడితే ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే ఆ బండ్ల పొగుడుతారని ఎవరైనా గుర్తిస్తారు. కానీ ఆ పొగడ్తలకే వీరు పడిపోతారు కదా..! అంటే పొగడ్తలను తాము ఎవాయిడ్ చేయరు కానీ స్టాలిన్‌లా అందరూ ఉండాలని అనుకుంటారు. ఒక్క వీరి విషయంలోనే కాదు.. మొత్తం సినీ తారలు..రాజకీయ నేతలు అంతే. వీరి బలహీనతను ప్రయోజనకరంగా మార్చుకునేందుకు బండ్ల లాంటి వాళ్లు ఎప్పుడూ రెడీగా ఉంటారు.

ప్రజాధనానికి గౌరవం ఇస్తున్న స్టాలిన్ – మన దగ్గర దుర్వినియోగం చేస్తేనో హీరో..!

ఒక్క పొగడ్తల విషయంలోనే కాదు స్టాలిన్ తెలుగు ప్రజల్ని ఆశ్చర్యపరిచే రీతిలో పాలన సాగిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగించాలని నిర్ణయించారు. ఇంకా చెప్పాలంటే అమ్మ క్యాంటీన్లలో జయలలిత ఫోటోలు కూడా అలాగే ఉంచాలని స్పష్టం చేశారు. ఆ నిర్ణయం తెలిసిన తర్వాత ఏపీ ప్రజలకు అన్న క్యాంటీన్లు గుర్తుకు వచ్చి ఉంటాయి. గత ప్రభుత్వంలో వాటిని పెట్టారన్న కారణంగా కొత్త ప్రభుత్వం వాటిని మూసివేయించింది. ఆ క్యాంటీన్లు పెట్టిన కారమంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్ క‌్యాంటీన్లు పెట్టి నాలుగు రూపాయలకే భోజనం అందిన వైసీపీ నేతలు .. అధికారంలోకి వచ్చిన అన్న క్యాంటీన్లు మూసేశారు… తమ రాజన్న క్యాంటీన్లనూ మూసేశారు. కనీసం పేరు మార్చి అయినా కొనసాగించాలని పేదలు ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలోనూ ఈ విషయంలో కాస్త మెరుగైన పాలసీనే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో ఐదు రూపాయలకు భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిసంఖ్యను మరింత పెంచారు కానీ.. సమైక్యవాది కిరమ్ పెట్టిన పథకం అని తీసి పడేయలేదు.

తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ సంస్కరణలు తెచ్చినట్లే..!

ఇటీవల స్టాలిన్ స్కూల్ బ్యాగులను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ స్కూల్ బ్యాగులపై తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి, జయలలిత బొమ్ములు ఉన్నాయి. పిల్లలకు పంపిణీ చేసేందుకు రూ. పదమూడు కోట్లు పెట్టి పళని స్వామి ప్రభుత్వం వాటిని సిద్ధం చేయించింది. అయితే పంచే సమయానికి ప్రభుత్వం పడిపోయింది. వాళ్ల బొమ్మలు ఉంటే ఏమవుతుంది.. రూ. పదమూడు కోట్లను వృధా చేయడం ఎందుకని స్టాలిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనిపై అక్కడ విద్యామంత్రి కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ల ఆశ్చర్యం కన్నా ఎక్కువగా తెలుగు ప్రజల ఆశ్చర్యం ఉంటుంది. గత ప్రభుత్వం చేపట్టిందని అమరావతినే నిలిపివేసిన ప్రభుత్వం ఆంధ్ర ప్రజల కళ్ల ముందు ఉంది. ఇక ఆదరణ పథకం పనిముట్లు దగ్గర్నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైన పథకాల సామాగ్రి గత ప్రభుత్వం కొనుగోలు చేసిందన్న కారణంగా పంపిణీ చేయకుండా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. అంత ఎందుకు ప్రజాధనంతోరూ. తొమ్మిది కోట్లతో కట్టిన ప్రజావేదికను నిర్మోహమాటంగా కూల్చేశారు. అలాంటివి వందలు.. వేల కోట్లను ప్రభుత్వం వృధా చేసింది కానీ.. ప్రజాధనం అనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. అలాంటిది రూ. పదమూడో కోట్ల ప్రజాధనం వృధా కాకూడదని రాజకీయ ప్రత్యర్థులకు క్రెడిట్ దక్కే బ్యాగులను సరఫరా చేయాలనడం ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఇక్కడ కూడా స్టాలిన్ గొప్పవాడే. కానీ మన రాష్ట్రంలో ప్రజా సంపదను దుర్వినియోగం చేసి వారు కూడా గొప్పవారే. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో పేరుకుపోవడం వల్లే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతోంది.

స్టాలిన్‌ను అభినందిస్తే సరిపోదు.. మనం కూడా నేర్చుకోవాలి..!

నిజంగా స్టాలిన్ ఇలాంటి ఆదర్శవంతమైన పనులు చేస్తున్నారో లేదో స్పష్టతలేదు. నిజంగా అలా చేస్తే ప్రజల్లో పలుకుబడి ఉండదని.. .ఆదరణ రాదని క్రేజ్ ఏర్పడదని సోకాల్డ్ రాజకీయ నేతలు అనకుంటూఉంటారు. అందుకే తాము చేసే పనులు చేస్తూ ఉంటారు. నిజంగా అదే నిజం అయితే స్టాలిన్ కూడా ప్రజా మద్దతును కోల్పోవాల్సి వస్తుంది. కానీ రాజకీయ నేతగా అన్నీ తెలిసి స్టాలిన్ ఆదర్శాల కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేస్తారా.. అంటే అంత అవకాశమే లేదని చెప్పుకోవచ్చు. నిజంగానే ప్రజల్లో రాజకీయ సంస్కరణలు రావాలని ఉంది. అలా చేసేవారిని ఆదరిస్తారు కూడా. కానీ పక్కన రాష్ట్రాల్లో రాజకీయ నేతలు అలా చేస్తే అభినందిస్తారు కానీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా చేస్తున్న వారిని ప్రోత్సహిస్తారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. ప్రజల్లోనే చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతుంది. దీన్ని గుర్తించిన రాజకీయ నేతలు తమ పని తాము చేసుకుంటూ పోతూంటారు. కులం, మతం, ప్రాంతం మత్తులో ఓటర్లను జోగేలా చేసి.. తమ పబ్బం తాము గడుపుకుంటూ ఉంటారు.

ప్రజల్లో మార్పు వచ్చిన రోజునే ముందుకెళ్తాం.. అప్పటి వరకూ వెనకకే..!

మొదటగా చెప్పుకున్నట్లుగా మంచి పనులు చేసేవాళ్లు పక్క ఇళ్లలో పుట్టాలని కోరుకుంటాం .. ఆ మంచి పనుల వల్ల మనకు ఏమైనా లాభం కలిగితే సరి.. లేకపోయినా పర్వాలేదు. ఆ మంచి వాడు మన ఇంట్లో పుట్టాలని మాత్రం కోరుకోం. ఎందుకంటే ఆయన చేసే మంచి పనుల వల్ల ఇబ్బందిపడేది కుటుంబసభ్యులే. ప్రస్తుతం దేశ ప్రజల మైండ్ సెట్ కూడా అంతే ఉంది. వారు మంచిని మంచిగా గుర్తిస్తున్నారు. చెడును చెడుగా గుర్తిస్తున్నారు. కానీ చెడు చేసే వాళ్లు.. తమను తాము సెల్ఫ్ మేడ్ దేవుళ్లుగా చిత్రీకరించుకుంటే పాలాభిషేకాలు చేస్తారు. పన్నుల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచి పెడితే అదే హీరోచితం అనుకుంటున్నారు. సొంత సొమ్ము పైసా ఇవ్వకపోయినా అడిగేవారుండరు. కానీ అన్నీ పక్కన పెట్టి సేవ చేసేవారు పక్క రాష్ట్రంలో ఉండాలనుకుంటారు. కానీ వారి వారి రాష్ట్రాల్లో ఉండాలని కోరుకోవడం లేదు. ఈ ప రిస్థితి ఎప్పుడు మారుతుంది అంటే.. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే. స్టాలిన్ లాంటి నేతలు ఆదర్శంగా నిలవాలంటే… ప్రజలచేతుల్లోనే ఉంది. అలాంటి పనులు చేసే వారిని కులం మతం పేరుతో ఓడిస్తూ పోతే ..దేశం ఎప్పటికీ వెనక్కి పోతూనే ఉంటుంది. రాజకీయ నేతలు అలా వెనక్కి తీసుకెళ్తూనే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close