జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు కరెక్ట్ కాదని దాల్మియా అప్పీల్ చేసిది. విచారమ జరిపిన ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ దాల్మియా సిమెంట్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తుల జప్తు సరైనదేనని ఉత్తర్వులు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793.34 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2011లో సీబీఐ నమోదు చేసిన క్విడ్ ప్రో కో కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేసులు పెట్టింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమ పెట్టుబడులు, క్విడ్ ప్రో కో డీల్స్ చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వం తరపున లీజులు కేటాయించినందుకు లంచాలుగా జగన్ సంస్థల్లో దాల్మియా పెట్టుబడులు పెట్టింది. CBI, ED దర్యాప్తుల ప్రకారం, దాల్మియా సిమెంట్ రూ. 95 కోట్లు భారతి సిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టింది. అలా పలు మార్లు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చారు. ఈ అక్రమ పెట్టుబడులు, షేర్ల విక్రయాలు , మనీ లాండరింగ్‌కు దారితీశాయని ఈడీ అంచనా. మొత్తం జప్తు విలువ రూ. 800 కోట్లకు పైగా ఉంది.
ఈడీ 2016లో మొదటి ప్రావిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసింది. 2019లో అడ్జ్యుడికేటింగ్ అధారిటీ ధృవీకరించింది. అలాగే మార్చి 31, 2025న ఈడీ హైదరాబాద్ యూనిట్ రూ. 793.34 కోట్ల విలువైన అస్తులు జప్తు చేసింది. ఈ ధృవీకరణ PMLA కింద జప్తు శాశ్వతమవుతుంది, కానీ అప్పీల్లకు అవకాశం ఉంది. హైకోర్టు లేదా స్పెషల్ PMLA కోర్టులో చాలెంజ్ చేయవచ్చు. మొత్తం కేసు CBI కోర్టులో ట్రయల్‌కు రావాల్సి ఉంది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు.