ఈనాడులో కలకలం: కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా

ఈనాడు చీఫ్ కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలియ‌ప‌రిచారు. దాదాపు 40 ఏళ్లుగా ఈనాడులో ఉద్యోగిగా ఉంటున్నారాయ‌న‌. ఇటీవ‌లే 40 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నారు. మ‌రింత కాలం ఆయ‌న ఈనాడులోనే ఉంటార‌నుకున్నారు. కానీ స‌డ‌న్ గా రాజీనామా చేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

ఈనాడు అంటే శ్రీ‌ధ‌ర్.. శ్రీ‌ధ‌ర్ అంటే ఈనాడు అన్న‌ట్టు సాగింది ఆయ‌న ప్ర‌స్థానం. తొలి పేజీలో పాకెట్ కార్ట్యూన్‌తో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించారు. ఆయ‌న విసిరే వ్యంగ్య బాణాల‌కు ల‌క్ష‌లాదిమంది అభిమానులు ఏర్ప‌డ్డారు. ఆయ‌న కార్టూన్ కోస‌మే ఈనాడు పేప‌ర్ చందాదారులుగా మారిన వాళ్లెంతో మంది. ఈనాడులో అత్య‌ధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఆయ‌న‌. ఆయ‌న్ని ఈనాడు యాజ‌మాన్యం ఎప్పుడూ ఉద్యోగిగా చూడ‌లేదు. రామోజీరావు ద‌త్త పుత్రుడిగానే చూసింది. ఈ విషయాన్ని రామోజీ రావు సైతం చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. సాక్షి మొద‌లైన‌ప్పుడు శ్రీ‌ధ‌ర్‌కి మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ శ్రీ‌ధ‌ర్ ఈనాడుని వ‌దిలి వెళ్ల‌లేదు. అలాంటి శ్రీ‌ధ‌ర్ ఇప్పుడు రాజీనామా చేయ‌డం షాకింగ్ విష‌య‌మే.

క‌రోనా త‌ర‌వాత ఈనాడు యాజ‌మాన్యంలో చాలా మార్పులొచ్చాయి. పెద్ద త‌ల‌కాయ‌ల్ని త‌ప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. త‌ద్వారా జీతాల భారం త‌గ్గించుకోవాల‌న్న‌ది యాజ‌మాన్య ఉద్దేశ్యం. ఎవ‌రిని త‌ప్పించినా శ్రీ‌ధ‌ర్ జోలికి మాత్రం రార‌న్న‌ది అంద‌రి నమ్మ‌కం. అయితే శ్రీ‌ధ‌ర్ రాజీనామాతో అది త‌ప్ప‌ని తేలింది. అన్న‌ట్టు శ్రీ‌ధ‌ర్ ఒక్కరే కాదు.. ఈనాడు నుంచి చాలామంది ఇప్పుడు త‌ప్పుకుంటున్నార్ట‌. అస‌లు విష‌యమేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close