ప్రభుత్వ ప్రకటనల్లో ఈనాడుకే ఎక్కువ..! ఈ మార్పు దేనికి సంకేతం..?

సాక్షి పత్రికకు.. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రకటనలు, సాక్షి మీడియా సిబ్బందికి అనధికారికంగా ప్రజాధనం జీతాల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు .. తీవ్రంగా వస్తున్న సమయంలో.. అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఆరోగ్యశ్రీ చికిత్సలు చేసుకున్న వారికి నెలవారీగా రూ. ఐదు వేలు సాయం అందించే పథకానికి జగన్ నేడు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా… ఈనాడు పత్రికకు.. ఫ్రంట్ పేజీ.. ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అదీ కూడా… ఏపీ ఒక్క ఎడిషన్‌కు మాత్రమే కాదు.. తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. గత ఆరు నెలల కాలంలో… ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలకు… పెద్ద ఎత్తున పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ.. ఈనాడుకు.. ఎప్పుడూ.. ఏపీ ఎడిషన్‌కు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఈ సారి మాత్రం.. తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు ఇచ్చారు.

ఈ ప్రకటనల్లో మరో విచిత్రం ఏమిటంటే… సాక్షి పత్రికకు.. హాఫ్ పేజీ ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఈ ఆరు నెలల కాలంలో.. సాక్షి పత్రికకు అన్ని పత్రికల కన్నా అగ్రప్రాధాన్యం లభించింది. ఫుల్ పేజీ ప్రకటనలు…అన్ని ఎడిషన్లలో ప్రకటనలు కామన్ గా కనిపించింది. ఈనాడుకి డబుల్‌ ప్రకటనలు ఉండేవి. కానీ.. ఈ సారి మాత్రం.. అంచనాలు తలకిందులు చేశారు. హాఫ్ పేజీ ప్రకటన మాత్రమే.. మూడు ఎడిషన్లకు ప్రభుత్వం తరపున సాక్షికి ఇచ్చింది. ఎప్పటిలాగే.. ఆంధ్రజ్యోతికి మాత్రం ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు.

మీడియాకు ప్రకటనలు జారీ చేయడానికి.. కొన్ని నిబంధనలు ఉంటాయి. అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ నిర్ధారించిన లెక్కల ప్రకారం… ప్రకటనలు ఇవ్వాలి. కానీ గత ఆరు నెలల్లో ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని సాక్షికి ప్రకటనల రూపంలో చెల్లించారు. ఎవరైనా ఈ అవకతవకలను ప్రశ్నిస్తూ.. కోర్టుకు వెళ్తే.. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో.. సాక్షి ప్రకటనల ధర రెండింతలు చేశారు. దీంతో.. సాక్షి నిర్వహణ వ్యయం అంతా.. ప్రజాధనమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు.. ఈనాడుకి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చి.. సాక్షికి హాఫ్ పేజీ ఇచ్చినా… చెల్లించే సొమ్ములో తేడా లేదని.. ఈనాడు కంటే ఎక్కువే.. సాక్షికి చెల్లిస్తారన్న అంచనాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిజెపి జనసేన పొత్తు విచ్ఛిన్న యత్నం? జీవీఎల్ కూడా వైకాపా మనిషేనా?

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక వర్గం మనిషి గా బయటికి మెలుగుతూ, అంతర్గతంగా వేరే వర్గానికి మద్దతు ఇచ్చే పాత్రలను అప్పుడప్పుడు చూస్తూవుంటాం. అయితే నిజ జీవితంలోని రాజకీయాలలో, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా...

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

HOT NEWS

[X] Close
[X] Close