విరాళాల స‌మ‌యం: అమ‌రావ‌తి పిలుస్తోంది!

జ‌గ‌న్ రెడ్డి పుణ్యం.. ఐదేళ్లుగా రాజ‌ధాని లేని రాష్ట్రంగా అప్ర‌తిష్ట‌పాలైంది ఆంధ్ర‌ప్ర‌దేశ్. అమ‌రావ‌తిని నిర్ల‌క్ష్యం చేసిన పాపం.. జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానిదే. ఇప్పుడు అమ‌రావ‌తిని పున‌రుద్ధ‌రించుకోవాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. త‌లో చేయీ వేసి, అమ‌రావ‌తి పునః నిర్మాణానికి పాటు ప‌డాల్సిన త‌రుణం వ‌చ్చేసింది. అందులో భాగంగా ఈనాడు తొలి అడుగు వేసింది. రామోజీరావు సంస్మ‌ర‌ణ సభ‌ను పుర‌స్క‌రించుకొని, ఈనాడు త‌ర‌పున రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఇది ఆరంభం మాత్ర‌మే. అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త ఆంధ్రులంద‌రిదీ. ఈనాడు వేసిన బాట‌లో మిగిలిన వ్యాపార‌వేత్త‌లు, సంస్థ‌లు, సామాజిక వేత్త‌లు, ముఖ్యంగా సినిమా వాళ్లూ న‌డ‌వాలి. త‌లో చేయీ వేయాలి.

గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలూ, అస‌మ‌ర్థ పాల‌న‌, బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల ద్వారా చాలా వ‌ర‌కూ ప్ర‌జాధ‌నం వృధా అయ్యింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. టీడీపీ ప్ర‌భుత్వంపై చాలా బాధ్య‌త ఉంది. పాల‌న గాడిలో పెట్ట‌డం ఒక ఎత్త‌యితే… అమ‌రావ‌తిని పునః నిర్మించ‌డం మ‌రో పెద్ద ప‌ని. ఉన్న ప‌రిమిత వ‌న‌రుల్ని ఉప‌యోగించుకొంటూ, ఈమ‌హా య‌జ్ఞం కొన‌సాగించ‌డం అంత సుల‌భం కాదు. ఇలాంటి త‌రుణంలోనే అంతా త‌మ వంతు సాయం అందించాలి. ముఖ్యంగా స్టార్లు ముందుకు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఉప‌ద్ర‌వం ఎదురైనా సినిమావాళ్లు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. త‌మ వంతు సాయం అందించారు. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. బ‌డా నిర్మాత‌లు, అగ్ర హీరోలు అనుకొంటే – అమ‌రావ‌తికంటూ ఓ ప్ర‌త్యేక‌మైన నిధి ఏర్పాటు చేయడం పెద్ద క‌ష్ట‌మేం కాదు. మ‌రి అలాంటి ప్ర‌య‌త్నాలేమైనా జ‌రుగుతాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close