ఈ శుక్రవారం వస్తోన్న సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా?! ఇదో హారర్, థ్రిల్లర్, ఫాంటసీ కథ. అందులోనే లవ్ స్టోరీ మిక్స్ చేశాడు దర్శకుడు. కథ, కథనాలు రక్తికట్టిస్తాయని, క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించలేరని చిత్రబృందం చెబుతోంది. హారర్సినిమా అంటే దెయ్యాన్ని చూపించాలి కదా? ఈ సినిమాలో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కథానాయికలుగా కనిపిస్తారు. అయితే వాళ్లెవ్వరూ దెయ్యాలు కాదట. ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అదేనట. ఇందులో మరో కథానాయికగా కూడా ఉంది. తనే అవికాగోర్. సినిమా మరో అరగంటలో ముగుస్తుందనగా ఆ పాత్ర ఎంటర్ అవుతుందని తెలుస్తోంది. ఆమెనే అసలు దెయ్యమని…. ఆ ముఫ్ఫై నిమిషాలూ ఈ సినిమాని పీక్స్ కి తీసుకెళ్లేది తనేనని టాక్.
మరో విషయం ఏమిటంటే.. హాస్య నటుడు వెన్నెల కిషోర్ కూడా కాసేపు దెయ్యంలా నటిస్తాడట. తనకి పట్టిన ఆత్మని వదిలించడానికి హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. వెన్నెల కిషోర్ నటన, తను పండించిన హాస్యం ఈ సినిమాకి కీలకమట. ఒక విధంగా చెప్పాలంటే… వెన్నెల కిషోరే ఈ సినిమాకి అసలు సిసలు హీరోగా అనిపించేలా ఉందట. మొత్తానికి సినిమా అయితే బాగా వచ్చిందని, నిఖిల్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో జనాలకు థియేటర్లకు వచ్చే మూడ్ ఉందా, లేదా? అనేదొక్కటే డౌట్ కొడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.