మోడీ, షాలపై ఈసీ చర్యలు తీసుకుంటుందట..! త్వరలో..!

ముస్లింలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి అన్నందుకు.. సిద్ధూపై మూడు రోజుల పాటు ప్రచారం నుంచి నిషేధం విధించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గంటలే పట్టింది. అంతకు ముందు అజంఖాన్ నుంచి మాయావతి వరకు.. అనేక మందిపై నిషేధం వేశారు. వీరందరూ.. కోడ్ ఉల్లంఘించినట్లు… గంటల్లోనే తేల్చారు. ఇక వీరు మాత్రమే కాదు.. వివాదాస్పదంగా మాట్లాడిన అనేక మందిపై కేసులు కూడా పెట్టారు ఈసీ అధికారులు. ఇవన్నీ… గంటల్లోనే జరిగిపోయాయి. కానీ.. మోడీ, అమిత్ షాలు మాత్రం పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నా… వారిపై చర్యల కోసం… తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారట.. .ఎన్నికల సంఘం అధికారులు. వారిద్దరికీ కోడ్ వర్తించదా అంటూ.. దేశం మొత్తం ఈసీపై వేలెత్తి చూపిస్తున్న సమయంలో… చాలా రోజుల పాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు మాత్రం.. కామ్‌గా ఉండే ప్రశ్నే లేదు. చర్యలు తీసుకుంటాం.. అని మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఎప్పుడు.. అంటే.. త్వరలో అనే సమాధానం రెడీగా పెట్టుకున్నారు.

బాలాకోట్ దాడులు చేసిన వారికే… మీ తొలి ఓటు ఇవ్వండి అని… అమిత్ షా, మోడీ బహిరంగసభల్లో తొలి సారి ఓటర్లను.. కోరుతున్నారు. ఇవే కాదు.. సైన్యం, దాడులు సహా.. కోడ్ పరిధిలోకి వచ్చి.. అసలు ప్రస్తావించకూడని అంశాలను తీసుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు మోడీ, షా. వీరి తీరుపై.. ఇతర పార్టీల నేతలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఈసీ స్పందించడం లేదు. వారిద్దరికీ కోడ్ ఉండదన్నట్లుగా ఈసీ కూడా ఉండటంతో… ఆ సంస్థ విశ్వసనీయతకే దెబ్బపడినట్లుగా అయింది. అయితే ఇప్పుడు మాత్రం… ఎన్నికలు ముగిసేవరకూ చూడబోమని.. ఈ లోపే… మోడీ, షాలపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఓ వైపు .. రోజువారీ పద్దతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు.. మోడీ, షాలకు మాత్రం.. ఎన్నికలు ముగిసేవరకూ.. అన్న ఆలోచన ఈసీకి ఎందుకొచ్చిందో వారే చెప్పాలి.

ఓ వైపు ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో… కోడ్ పేరుతో.. ఈసీ చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ఓటర్లను ఇక ప్రభావితం చేసే అవకాశం లేకపోయినప్పటికీ.. ఏ మాత్రం.. కోడ్ రిలీఫ్ ఇవ్వకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా చేస్తున్నారు. ఏపీ లాంటి రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఏకంగా సంబంధం లేని సీఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి ఆ స్థానంలో మరో అధికారిని నియమించారు. ఆయన తానే సీఎం అన్నట్లుగా ఫీలైపోయి.. కేబినెట్ నిర్ణయాలను కూడా ప్రశ్నించే పరిస్థితికి చేరిపోయారు. ఇన్ని జరుగుతున్నా..ఈసీ కామ్‌గా ఉంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close