ఎలాన్ మస్క్ బ్రిటన్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా అక్కడ ముస్లిం ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవి ప్రత్యేక ఉద్యమాలుగా మారుతున్నాయి. అసలు ఇమ్మిగ్రెంట్లు మొత్తాన్ని వ్యతిరేకించేలా..కొంత మంది నేతలు తయారయ్యారు. వారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారికి ఎలాన్ మస్క్ ప్రోత్సాహం ఇస్తున్నారు.
ఆదివారం లండన్ లో నిర్వహించిన ఇమ్మిగ్రెంట్స్ వ్యతిరేకత ర్యాలీకి ఎలన్ మస్క్ సపోర్టు చేశారు. అమెరికా నుంచి ఆన్ లైన్ లో ప్రసంగించి వారిని మరింతగా రెచ్చగొట్టారు. ఇప్పుడుపోరాడకపోతే చచ్చిపోతారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన మాట తీరుతో.. ఇంకా ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అమెరికా కూడా హింస పెరిగిపోయిందని.. అక్రమ వలసల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
అంతే కాదు ఇలాంటి ఆందోళనల్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు దిగిపోవాలని ఆయన అంటున్నారు. లీగల్ గా వచ్చి యూకేలో ఉంటున్న వారిని నిందించడం సరి కాదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంటున్నారు. అందుకే ఆయన రాజీనామా చేయాలని మస్క్ అంటున్నారు. కారణం ఏదైనా అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో వలసలపై నిరసనలు పెరుగుతున్నాయి. అక్రమ వలసదారుల్నే కాకుండా.. లీగల్ గా వచ్చిన వారిని కూడా వ్యతిరేకించడం ఓ ఫ్యాషన్ గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్.. ఆ ఉద్యమాలకు మరింతగా ఆజ్యం పోస్తున్నారు.