ఉద్యోగాలిచ్చారు.. జీతాలివ్వట్లేదు..!

లక్షన్నర పర్మినెంట్ ఉద్యోగాలిచ్చాం. ఆరు నెలల్లో సాధించిన గొప్ప విజయం అంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ.. ఆ లక్షన్నర పర్మినెంట్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి రెండు నెలలు దాటిపోయింది. కానీ ఇంత వరకూ… ఒక్కరంటే.. ఒక్కరికీ కూడా.. జీతాలు చెల్లించలేదు. అక్టోబర్ ప్రారంభంలో… అందరికీ నియామక పత్రాలు అందించారు. నవంబర్ ఒకటో తేదీన జీతం వస్తుందని.. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ.. అలాంటి ఆలోచనే సర్కార్ చేయలేదు. అప్పటికి ఎలాంటి వ్యవస్థ.. గ్రామ సచివాలయాలు లేకపోవడంతో… సరే.. వచ్చే నెల నుంచి ఇస్తారని ఎదురు చూశారు.

నవంబర్‌లో గ్రామ సచివాలయ ఉద్యోగులుకు కొన్ని పనులు అప్పగించారు. వారు కూడా విధులకు వెళ్లారు. డిసెంబర్ మొదట్లో… అందరితో పాటు తమకూ జీతాలొస్తాయని ఎదురు చూశారు. కానీ.. రాలేదు. కనీసం.. తమ బ్యాంక్ అకౌంట్లు.. ఇతర వివరాలు అయినా తీసుకుంటారేమోనని ఎదురు చూశారు. అవి కూడా తీసుకోలేదు. చివరికి..అధికారులు రొక్కం చేతికిస్తారేమోనని ఎదురు చూశారు. కానీ.. పదో తారీఖు దాటినా.. అలాంటి సూచనలు కనిపించడం లేదు. పైగా.. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయని.. ముఖ్యమంత్రి చెబుతున్నారు.

దాని అర్థం.. జనవరి నుంచి పని చేస్తే.. ఫిబ్రవరి నుంచి జీతాలు వస్తాయని.. అధికారులు.. ఇప్పుడిప్పుడే.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో.. అప్పటి వరకూ తాము జీతం లేకుండా పని చేయాలా.. అని.. వారు అసంతృప్తికి గురవుతున్నారు. వీరితో పనులు చేయించుకుంటున్న కలెక్టర్లు… తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వారికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంత మంది … ఏదో ఓ ఖాతాలో చూపి.. వారికి ఎంతో కొంత సాయం చేస్తున్నా… అది జీతం కాదు.. అప్పు ఖాతానే. అందుకే.. ఉద్యోగాలిచ్చి.. జీతాలివ్వడం లేదని.. సచివాలయ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close