అద్వానీకి ప్రత్యామ్నాయం అమిత్ షానే..! బీజేపీ మారిపోయినట్లే..!

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 184 మంది ఉన్నారు. 2014లో మోదీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. వడోదరను వదిలేసి వారణాసి ఎంపీగా కొనసాగారు. ఇప్పడు ఐదేళ్ల తర్వాత ఆయన మరో సారి వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ సారి అనూహ్యంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభ ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఆయన గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారని పార్టీ ప్రకటించడంతో రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ కెరీర్ ముగిసినట్లయ్యింది. దాదాపుగా సిటింగులందరికీ అవకాశం లభించగా.. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ… మరో సారి రాహుల్ గాంధీపై పోటీ పడుతున్నారు..

బీజేపీ తొలి జాబితాలో అందరినీ ఆశ్చర్య పరిచే పేరు అమిత్ షాదే. పార్టీ పనులకే పరిమితమవుతారనుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా..గుజరాత్లోని గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీనితో అద్వానీ నిష్క్రమణ ఖాయమైంది. కొన్ని రోజుల క్రితం అమిత్ షా వెళ్లి అద్వానీ ని కలిసినప్పుడు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు చెప్పాయి. కానీ పోటీ చేయాలంటూ అద్వానీని ఎవరూ కోరలేదని అద్వానీ వ్యక్తిగత కార్యదర్శి రెండు రోజుల క్రితం ప్రకటించడంతో ప్లాన్డ్ గా నే అద్వానీని పక్కన పెడుతున్నట్లు స్పష్టమయినది. గాంధీ నగర్లో పోటీ చేస్తున్న అమిత్ షా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ మరో సారి అధికారానికి వస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని కూడా ప్రచారం జరుగుతోంది. గాంధీ నగర్ బీజేపీ కంచుకోట కావడంతో అమిత్ షాను అక్కడ నుంచి బరిలోకి దించుతున్నారు.

రాజ్ నాథ్ సింగ్ లఖ్ నవ్ నుంచి పోటీ చేస్తుండగా, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ మళ్లీ నాగ్ పూర్ గడ్డ మీదే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. హేమ మాలిని .. మరో సారి మథుర నుంచి బరిలోకి దిగుతారు. రాజ్యసభ సభ్యురాలైన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా రెండో సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేఠీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఇప్పుడు మళ్లీ అక్కడే బరిలోకి దిగుతున్నారు. మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత కేంద్రమంత్రుల్లో ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులుండేవారు. ఇప్పుడా ట్రెండ్ కు తెరదించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 75 సంవత్సరాలు దాటిన సీనియర్లకు మినహా సిట్టింగులందరికీ అవకాశం ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close