టాలీవుడ్ ఆర్థిక మూలాలపైనే ఈడీ గురి..!

డ్రగ్స్ పేరుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సినీ ప్రముఖులను ప్రశ్నించడానికి రంగంలోకి దిగింది. కానీ అసలు డ్రగ్స్ కేసు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మనీ లాండరింగ్ అంశంపైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కేవలం డ్రగ్స్ కేసులకు సంబంధించి చేసిన మనీ ట్రాన్స్‌ఫర్లు కాదు. ప్రతీ లావాదేవీని పరిశీలిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. విదేశాలకు నిధులు ఎందుకు పంపారు.. మళ్లీ ఎలా స్వీకరించారు వంటి వాటిని ఆరా తీస్తున్నారు. పూరి జగన్నాథ్ వైపు నుంచి ఈ తరహా లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. పూరీతో పాటు వ్యాపారం చేస్తున్న, సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన చార్మి అకౌంట్ నుంచి కూడా ఈ లావాదేవీలు ఉన్నాయి.

రూ. కోట్లలో ఉన్న విదేశీ నగదు లావాదేవీలను ఈడీ ప్రస్తావించడంతో పూరి జగన్నాథ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కేవలం డ్రగ్స్ కేసులో అనుమానితులకు పంపిన డబ్బుల గురించి మాత్రమే ప్రశ్నిస్తారని ఆయన అనుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ తర్వాత అసలు లావాదేవీల గురించి ప్రశ్నించడంతో బండ్ల గణేష్ విషయాన్ని ప్రస్తావించారు. అప్పటికప్పుడు ఈడీ అధికారులు బండ్లను కూడా పిలిపించారు. కానీ తనకేమీ తెలియదని .. పూరిని పూర్తిగా ఇరికించి వచ్చినట్లుగా తెలుస్తోంది. పూరి బిజినెస్ పార్టనర్ చార్మిని బుధవారం ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. ఆ తర్వాత నుంచి మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సాధారణంగా సినీ పరిశ్రమ అంటే చాలా వరకూ లావాదేవీలు గుట్టుముట్టుగానే సాగుతాయి. అధికారికంగా జరిగే లావాదేవీలు తక్కువే ఉంటాయి. మనీ లాండరింగ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ అంశంపై దర్యాప్తు ఎవరూ ఇంత వరకూ పెద్దగా దృష్టి పెట్టలేదు. బడా బడా నిర్మాణ సంస్థలు చాలా వరకూ నిక్కచ్చిగానే ఉన్నా.. కొత్తగా వస్తున్న నిర్మాతలు ఎక్కువగా లెక్క చూపని డబ్బుల్నే పెట్టుబడిగా పెడుతున్నారు. ముఖ్యంగా బినామీలుగా పేరు పడిన వారు ఇలా ఇతరుల అక్రమ సంపాదనను సినీ పరిశ్రమలోకి తరలిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈడీ ఈ మొత్తం నగదు లావాదేవీల్ని బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది.

ఈడీ విచారణ ముందుకు జరిగే కొద్దీ డ్రగ్స్ కోణం పూర్తిగా పక్కకుపోయే అవకాశం ఉంది. కేవలం మనీలాండరింగ్ అదీ కూడా పూర్తి స్థాయిలో జరిగిన అక్రమ లావాదేవీలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడివి.. ఎవరు ఇచ్చారు… ఎలా తరలించారు.. ఎందుకు తరలించారు ఇలాంటివన్నీ బయటకు తీస్తే టాలీవుడ్‌లో ఆర్థిక మూలాలన్నీ బయటపడతాయి. అదే సమయంలో రాజకీయ ప్రకంపనలు కూడా రేగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాపోరుపై ఏపీ బీజేపీ ఆశలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉనికిచాటుకునేందుకు ఇప్పుడు హడావుడిగా ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టుకుని గట్టిగానే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు...

ఏపీసీఐడీ కోర్టుకు దొరికిపోయినట్లే – బలి చేసేదెవరిని ?

ఏపీసీఐడీకి కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జర్నలిస్ట్ అంకబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో పచ్చి అబద్దాలు ఆడారు. ఇప్పుడు న్యాయస్థానం వాటికి...

ఏపీలో ప్రభుత్వం మారుతుందని షర్మిల నమ్మకం !

ఏపీలో ముఫ్పైఏళ్లు మాదే అధికారం . మేం ఏం చేసినా తిరుగులేదు అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వైసీపీ క్యాడర్‌లో ఉంది. ప్రజాస్వామ్యంలో శాశ్వతం...

రివ్యూ: అల్లూరి

Alluri Movie Telugu Review పోలీస్ క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి జ‌నం క‌నెక్ట్ అయితే.. తెర‌పై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ క‌థ‌ల‌తో సైతం.. మెస్మ‌రైజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close