లార్డ్స్‌లో ఫైనల్ ధ్రిల్లర్..! ఇంగ్లాండే చాంపియన్.. !

క్రికెట్ మక్కా లార్డ్స్ తన పేరును మరోసారి నిలబెట్టుకుంది. అత్యంత రొమాంఛితమైన ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆతిధ్యం ఇచ్చింది. మ్యాచ్‌లో చివరి బాల్ వరకూ కాదు… సూపర్‌ఓవర్‌లో చివరి బాల్‌ వరకూ సాగిన మ్యాచ్‌లో… వెంట్రుకవాసిలో.. ఇంగ్లాండ్ చాంపియన్‌గా అవతరించింది. మొదట యాభై ఓవర్లలో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్లలోనూ సమం అయినా… కివీస్‌ ఓ వికెట్ కోల్పోవడంతో.. ఇంగ్లాండ్‌ను ఐసీసీ రూల్స్ ప్రకారం విజేతగా ప్రకటించారు. దాంతో.. ఇంగ్లిష్ టీం చాంపియన్ అయింది.

క్రికెట్ మాతృభూమిని ముద్దాడిన ప్రపంచకప్..!

క్రికెట్‌కు మాతృదేశం అయిన ఇంగ్లాండ్.. ప్రపంచ చాంపియన్ అవడానికి దశాబ్దాలకు.. దశాబ్దాలుగా కళ్లకు కాయలు కాచేలా ఎదురు చూసి.. చివరికి అనుకున్నది సాధించింది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌లో.. తమ దశాబ్దాల లోటును తీర్చుకుంది. క్రికెట్‌ను తమ ఆస్తిగా భావించుకునే దేశానికి ఇంతా కాలానికి మోర్గాన్ జట్టు కిరీటాన్ని తెచ్చి పెట్టింది. చరిత్రలో.. ఇంగ్లాండ్ తరపున… దిగ్గజ ఆటగాళ్లు.. ఎంతో మంది ఆడినప్పటికీ.. వారెవరికీ సాధ్యం కాని అనిరసాధ్యమైన విజయాన్ని … మోర్గాన్ అండ్ టీం సాధించి పెట్టింది.

కల చెదిరిన కివీస్..!

ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న రెండు జట్లూ.. కప్పును సగర్వంగా పైకెత్తడానికి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవే. న్యూజిలాండ్.. నాలుగు సార్లుప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఇంగ్లాండ్ పరిస్థితీ అంతే. అసలు క్రికెట్ అంటే.. తమదే అని చెప్పుకుేన జట్టుకు ఇంత వరకూ… చాంపియన్ షిప్ దక్కలేదు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని న్యూజిలాండ్ కన్నా.. ఇంగ్లాండే ఎక్కువగా వినియోగించింది. నిజానికి.. న్యూజిలాండ్ .. లక్ బై చాన్స్… ఫైనల్‌కు వచ్చింది. అప్రతిహత విజయాలతో.. లీగ్ దశలో నెంబర్ వన్ గా నిలిచిన టీమిండియాపై …లీగ్ దశలో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి… ముక్కీమూలిగి అతి కష్టం మీద నాలుగో స్థానంతో..సెమీస్‌కు వచ్చిన కివీస్.. ఆ లక్కును.. ఫైనల్‌లో అందుకోలేకపోయింది. కానీ పోరాటాన్ని మాత్రం..అద్భుతంగా కొనసాగించింది.

కివీస్ ఆశలపై స్టోక్స్, బట్లర్ నీళ్లు..!

ఫైనల్ మ్యాచ్‌లో.. ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఏ దశలోనూ.. ఇంగ్లాండ్‌కు భారీ టార్గెట్ నిర్ణయిద్దామనే ప్రయత్నం చేయలేదు. సాదాసీదాగా ఇన్నింగ్స్ కొనసాగించింది. చివరికి 242 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. మొదట న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూసిన వాళ్లు.. ఇంత సాదాసీదా ప్రపంచకప్ ఫైనల్ ఏమిటని అనుకున్నారు. కానీ తర్వాత కివీస్ బౌలర్లు.. ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. 86 పరుగులకే నాలుగు వికెట్లు తీశారు. పరుగులు కూడా కట్టడి చేశారు. రన్ రేట్ పెంచుతూ.. పోయి.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తెచ్చారు. స్టోక్స్, బట్లర్‌లు.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడ్డారు. కానీ.. ప్రతి దశలోనూ.. కివీస్‌కు విజయవకాశాలు కనిపించాయి. కొన్ని కివీస్ చేజేతులా పోగొట్టుకుంది.

క్రికెట్ మక్కా లార్డ్స్‌లో మరో చారిత్రక సన్నివేశం..!

ఫైనల్‌కు ఇండియా, ఆస్ట్రేలియా వస్తాయని.. ఇది క్రికెట్‌కు మంచిది కాదని… సెమీస్‌ మ్యాచ్‌లకు ముందు… క్రికెట్ పెద్దలు చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. వారనుకున్నట్లుగా.. అటు ఆస్ట్రేలియా.. ఇటు ఇండియా.. రెండూ ఫైనల్‌కు రాలేదు. క్రికెట్‌కు మంచి జరిగిందో లేదో మాత్రం భవిష్యత్ చెబుతుంది కానీ.. ప్రపంచకప్‌కు మాత్రం.. ఈ సారి ఓ కొత్త చాంపియన్ ఆవిర్భవించారు. ఇంగ్లాండ్ కల నెరవేరింది. లార్డ్స్ మైదానికి మరోసారి చారిత్రక హోదా దక్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com