దావోస్‌లో చంద్రబాబుతో ఐదు అంటే ఐదు నిమిషాలు మాట్లాడామని ఆయన విజన్ నచ్చి..ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాడనికి వచ్చామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ చెప్పారు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ జరిగింది. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సీఐఐ ఈ సమావేశాన్ని సమన్వయం చేసింది.
ఈ సమ్మిట్ లో చంద్రబాబు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి ఉభయతారక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా దుబాయ్ లాంటి ఆర్థిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఏపీలో తీరప్రాంతం, బలమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉన్నాయని తెలిపారు. – 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్లు సహకరిస్తుందని, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ అమరావతి భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నారా లోకేష్ అన్నారు. పేర్కొన్నారు.
యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ, దావోస్‌లో జనవరి 2025లో చంద్రబాబు నాయుడుతో 5 నిమిషాల సమావేశం తర్వాత, ఆయన విజన్‌కు ఆకర్షితులై, 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలను పరిశీలిస్తోంది. త్వరలో పెట్టుబడుల ప్రకటనలు చేసే అవకాశం అవకాశంఉంది.