బీఆర్ఎస్ దూకుడుగా ఉంటున్నా ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఆయనేదో పెద్ద ప్లాన్ లో ఉన్నారని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా తెరపైకి వచ్చారు. తాను ఓ సర్వే చేయించానని అందులో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా 80 నుంచి 100 సీట్లలో గెలుస్తుందన్న ఫలితం వచ్చిందని ప్రకటించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తన సర్వే ఫలితాలు ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 20 సీట్లు మార్చాలని కెసిఆర్ తో చెప్పినట్లు దయాకర్ రావు చెప్పారు. ఆ మార్పు చేయాల్సిన సీట్ల లో నా సీటు కూడా ఉందని దయాకర్ రావు తెలిపారు. కానీ కెసిఆర్ నా మాట వినలేదని మార్పులు చేయాల్సిన అవసరం లేదని నిరాశ వ్యక్తం చేశారు. మనమే గెలుస్తామని ధీమాతో కెసిఆర్ మార్పులు చేయకుండా ఎలక్షన్ వెళ్లారన్నారు. కానీ అధికారంలోకి రాలేకపోయామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 80 నుండి 100 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు.
తన సర్వే రిపోర్ట్ లో 80 నుండి 100 గెలుస్తుందని వస్తే… ఓ టివి ఛానల్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ కు 61 సీట్లు వస్తున్నట్లు చేస్టింజనియయ
కేసిఆర్ తనకు చెప్పారని దయాకర్ రావు అన్నారు. ఎలాగైనా అధికారంలోకి వస్తున్నామని దయాకర్ రావు ధీమా వ్యక్తంచేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు .. సర్వేల స్పెషలిస్టుగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీనియర్ నేత అయినా ఆయన హైదరాబాద్ రావడం లేదు. వరంగల్ కే పరిమితమవుతున్నారు.