మరోసారి ఈటలతో కాంగ్రెస్ లోపాయికారీ రాజకీయం !

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాకివ్వాలనుకుంటున్న ఈటల రాజేందర్ ప్రయత్నాలకు కాంగ్రెస్ సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో పోటీ జరుగుతోంది.అక్కడ ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు ఎవరికైనా మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. కరీంనగర్‌లో తనకు మద్దతివ్వాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకు ఈటల రాజేందర్ మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటల వర్గీయులు.. కాంగ్రె్స్ గకలిసి ఆయను గెలిపించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. నిర్ణయాన్ని కోమటిరెడ్డికి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా.. లేకపోతే ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. నిజానికి అన్ని చోట్లా టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎక్కడైనా ఓడిపోయిందటే.. జారిపోతున్న ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ ఈ సారి ఈటల తరహాలోనే ఆలోచిస్తేంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్న మంత్రులు, ప్రభుత్వం !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close