పవన్ కల్యాణ్ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ప్రచారంలో భాగంగా ‘ఎవరది ఎవరది’ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటకు కీరవాణి ఆకట్టుకునే స్వరాలు అందించారు. సాయిచరణ్, హైమత్, లోకేశ్వర్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ప్రత్యేకంగా వుంది.
ఎవరది ఎవరది అతగాడో పొడుపు కథ
దొరకనే దొరకడు అతగాడో ఒక మెరుపు కల
సూర్యుడికే కన్నుగప్పి సంచరించే యోధుడు
చంద్రున్నే సంచికెత్తి తస్కరించే ధీరుడు
దోచుకునే విద్యలో అహో సిద్ధహస్తుడు
దాచుకునే ధ్యాసలో మహా బద్దకస్తుడు
పరుల కొరకే ప్రతి పైసా పంచిపెట్టే చోరుడు
హరిహర వీరమల్లు..ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు..
మొఘల్ కాలం నాటి ఈ కథలో రాబిన్హుడ్ లాంటి దొంగ క్యారెక్టర్ లో కనిపిస్తారని వినిపించింది. రామజోగయ్య లిరిక్స్ పర్ఫెక్ట్ గా రాబిన్హుడ్ క్యారెక్టర్ కి సరిపోయేలా వున్నాయి. పవన్ కళ్యాణ్ హిస్టారికల్ సినిమా చేయడం ఇదే తొలిసారి. సాంగ్ వీడియోలో యాక్షన్, వీరమల్లు క్యారెక్టరైజేషన్ లో సరికొత్తగా కనిపించారు పవన్. ఈ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.