ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్ బాస్ 5 తో క్లాష్ కానుందా?

వెండితెర పైనే కాకుండా బుల్లితెర మీద కూడా గతం లోనే తన విశ్వ రూపాన్ని చూపించిన ఎన్టీఆర్ త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా మరొక సారి తెలుగు వీక్షకులను పలకరించనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రోగ్రాం, బిగ్ బాస్ 5 తో పోటీ పడాల్సి వస్తుంది అన్న వార్తలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక వేళ రెండు ప్రోగ్రామ్స్ ఒకే నెలలో ప్రసారం అయితే బుల్లి తెర పై టిఆర్పి రేటింగుల హోరా హోరి నడుస్తుందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మీలో ఎవరు కోటీశ్వరుడు మళ్లీ అలరించగలదా ?

హూ వాంట్స్ టు బికమ్ ఏ మిలియనీర్ కార్యక్రమం ఆధారం గా భారత దేశం లో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం మొదలైంది. అమితాబచ్చన్ ప్రయోక్త గా మొదలైన ఈ ప్రోగ్రాం సూపర్ హిట్ కావడం తో ఇతర భారతీయ భాషలలో కూడా అనేక చానల్స్ లో ఈ ప్రోగ్రాం ప్రసారమైంది. తెలుగు లో మీలో ఎవరు కోటీశ్వరుడు అన్న పేరుతో ఈ కార్యక్రమాన్ని అక్కినేని నాగార్జున యాంకర్ గా 3 సీజన్స్ చేశారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాతి సీజన్స్ లో ఎమోషన్స్ సరిగా పండక పోవడం, అసలు కార్యక్రమం కంటే అక్కినేని కుటుంబం పై పొగడ్తల వర్షం ఎక్కువ కావడం వంటి వాటి కారణంగా మూడవ సీజన్ ప్రేక్షకాదరణ కి నోచుకోలేదు. ఇక మూడవ సీజన్ ఫెయిల్ కావడంతో నాలుగవ సీజన్ పై ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేని సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సరిగ్గా చిరంజీవి యాంకర్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు వచ్చే సమయం లోనే జయ లలిత అనూహ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరడం, జయ లలితకు సంబంధించిన న్యూస్ ప్రోగ్రామ్స్ పైనే ఆ రెండు నెలలు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఉండడంతో చిరంజీవి యాంకర్ గా వచ్చిన సీజన్ 4 విజయవంతం కాలేదు. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు అన్న కాన్సెప్ట్ కూడా జనాలకు అప్పటికే మొహం మొత్తేయడం కూడా దానికి మరొక కారణం. ఈ నేపథ్యం లో ఇదే కాన్సెప్ట్ మళ్లీ బుల్లితెర మీద హిట్ అవుతుందా, ఎన్టీఆర్ మ్యాజిక్ పనిచేస్తుందా, టిఆర్పి రేటింగ్ లలో మా టీవీ, జీ తెలుగు, ఈ టీవీ ల కంటే కింద నున్న జెమినీ టీవీ మళ్లీ పుంజుకుంటుందా అన్న చర్చ మీడియా వర్గాల లో జోరుగా నడుస్తోంది.

బిగ్ బాస్ 5 తో ఎన్టీఆర్ ప్రోగ్రాం క్లాష్ అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం?

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం మొదటి సీజన్ సూపర్ హిట్ అయిన తర్వాత ఆ ప్రోగ్రాం గ్రాఫ్ పడిపోతూ వస్తే, బిగ్ బాస్ ప్రోగ్రాం దానికి విరుద్ధంగా మొదటి సీజన్ నుండి ఒక్కొక్క సీజన్ కి గ్రాఫ్ పెంచుకుంటూ ఒక సీజన్ మించి మరొక సీజన్ హిట్ అవుతూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 లో పేరొందిన సెలబ్రిటీలు ఎవరూ లేక పోయినప్పటికీ ఆ సీజన్ మునుపటి సీజన్ కంటే పెద్ద హిట్ అవడానికి కారణం తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ఆటకు ఒక రకంగా అడిక్ట్ అయిపోవడమే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 కి ఖచ్చితంగా ఎక్కువ ప్రజాదరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. పైగా తమ ప్రోగ్రాం ని ప్రమోట్ చేసుకోవడం లో మా టివి ది అందెవేసిన చెయ్యి. అయితే ఈ రెండు ప్రోగ్రామ్స్ క్లాష్ అయితే వీటి మధ్య పోటీ కారణంగా రెండింటికీ మంచి పబ్లిసిటీ లభించే అవకాశం, రెండింటికీ ఊహించిన దానికంటే ఎక్కువ రేటింగులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఏది ఏమైనా తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్టీఆర్, నాగార్జున లు ఒకరిని మించి మరొకరు తమ యాంకరింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. బుల్లి తెర పై జరగనున్న ఈ హోరా హోరీ కోసం మరో నెలరోజులు వేచి చూడాల్సిందే..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close