రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తి కొనుగోలు లేదా విక్రయం చేసినప్పుడు, చాలా మంది రిజిస్ట్రేషన్‌పై మాత్రమే దృష్టి పెడతారు. కానీ, ఆస్తి యజమాని మార్పు పూర్తిగా లీగల్‌గా గుర్తింపు పొందాలంటే మ్యూటేషన్ ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. ఇటీవలి కాలంలో ఆస్తి వివాదాలు పెరుగుతున్న కారణంగా మ్యూటేషన్ లేకుండా ఆస్తి లావాదేవీలు పూర్తికావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మ్యూటేషన్ అనేది వ్యవసాయ భూములకే అని ఎక్కువ మంది అనుకుంటారు. మ్యూటేషన్ అంటే కొనుగోలు, విక్రయం, వారసత్వం లేదా బహుమతి తర్వాత స్థానిక రెవెన్యూ లేదా మున్సిపల్ రికార్డులలో కొత్త యజమాని పేరును నమోదు చేసే ప్రక్రియ. ఇది రిజిస్ట్రేషన్‌తో భిన్నం – రిజిస్ట్రేషన్ ఆస్తి ట్రాన్స్ఫర్ను లీగల్‌గా రికార్డు చేస్తుంది, అయితే మ్యూటేషన్ ప్రభుత్వ రెవెన్యూ రికార్డులలో మార్పును అప్డేట్ చేస్తుంది. దీని ద్వారా ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు, ఇతర సర్వీసులు కొత్త యజమాని పేరుపైకి మారతాయి.
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మ్యూటేషన్ లేకుండా ఆస్తి పూర్తిగా మీది కాదు. ఇది ఆస్తి వివాదాలను నివారిస్తుంది . బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ లేదా ఆస్తి విక్రయం సమయంలో అవసరం. ఉదాహరణకు, ఆస్తి వారసత్వంగా వచ్చినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు, మ్యూటేషన్ ద్వారా మాత్రమే ప్రభుత్వ రికార్డులలో మీ పేరు నమోదవుతుంది. ఇది ఆస్తి యజమాని హక్కులను రక్షిస్తుంది.
అందుకే ఆస్తి రిజిస్ట్రేషన్‌తో సరి పెట్టుకోవద్దు. మ్యూటేషన్ కూడా పూర్తి చేయడం మంచిది.
