నకిలీ లిక్కర్ స్కామ్ సూత్రధారి జోగిరమేష్ అనేదానికి అవసరమైన అన్ని సాక్ష్యాలూ లభిస్తున్నాయి. జోగి రమేష్ చేస్తున్న హడావుడి చూస్తూనే .. తేలుకుట్టిన దొంగలా ప్రవర్తిస్తున్నారేంటి అని ఎవరైనా అనుకుంటారు. ఆ తర్వాత వరుసగా సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియని ఓ సారి..ఎప్పుడూ కలవలేదని మరోసారి కబర్లు చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన చెప్పేవన్నీ అబద్దాలని ఫోటోలు, వీడియోల సాక్షిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఆయన వాట్సాప్ లో .. నిరంతరం అద్దేపల్లితో టచ్ లో ఉన్నారని వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. అది ఫేక్ అని ఆయన మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో కాకుండా.. పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అద్దేపల్లితోపాటు జగన్మోహన్ అనే మరో లిక్కర్ కేసు నిందితుడితో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో సన్నిహితుల్లా.. పట్టని కుర్చీలో.. ఒకరి ఒళ్లో ఒకరు కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ శాంపిల్స్ అని అసలు వీడియోలు… త్వరలో బయటకు వస్తాయని అంటున్నారు.
దీపావళి తర్వాత జోగి రమేష్ కు పటాసులు పేల్చేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వంపైనే కుట్ర చేస్తే.. అన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఊరుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. ఆ కస్టడీలో మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. కల్తీ మద్యం కుట్ర ఏమిటో మొత్తం బయట పెట్టనున్నారు.