టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్ ప్రకారం… జూన్ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ వాయిదా అనే ప్రకటన చేయలేదు. ఇంటర్ పరీక్షల్ని కూడా.. చివరి రోజు వరకూ జరిగితీరుతాయని ప్రకటించారు. ప్రశ్నాపత్రాలు కూడా.. ఆయా పరీక్షా కేంద్రాల పోలీస్ స్టేషన్లకు చేరుకున్న తర్వాత అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే.. టెన్త్ పరీక్షలు మాత్రం నిర్వహించి తీరుతామని తాజాగా చెబుతున్నారు. అయితే ముందుగా షెడ్యల్ ఇస్తామని ఆ తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ చెబుతున్నారు.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జామ్స్ జరిగే పరిస్థితి లేదు. అందుకే వాయిదానో.. రద్దో చేశారు. ఒక వేళ మళ్లీ పరిస్థితులు అనుకూలిస్తే.. తదుపరి విద్యాసంవత్సరంపై దృష్టిపెట్టాలని అనుకున్నారు. ఏపీలో మాత్రం విద్యార్థుల భవిష్యత్ కోసం .. ప్రభుత్వం ఆరాటపడుతోంది.దీని వల్ల విద్యార్థులు.. టెన్షన్ పడుతున్నారు. ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనే టెన్షన్ ఓవైపు విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతూంటే… పరీక్షలు నిర్వహిస్తే.. తమ పిల్లలకు ఎక్కడ వైరస్ సోకుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది కూడా .

కానీ ఏపీ సర్కార్ మాత్రం ఇప్పటికీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలోనే ఉంది. ఒక వేళఇప్పుడు రద్దు చేయకపోయినా… ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది సాధ్యం. ఒక రోజు ముందుగానో.. రెండు రోజుల ముందుగానో వాయిదానో ..రద్దో చేయక తప్పదని అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉండటం వల్లనే.. మళ్లీ షెడ్యూల్ ఇస్తామని.. మంత్రి సురేష్ చెప్పినట్లుగా అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close