హుజురాబాద్‌లో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ బంద్ ..!

హుజురాబాద్‌లో గెలుపెవరిది అంటూ వచ్చే ఊహాగానలకు ఇక చెక్ పడింది. అలాంటి ఊహాగానాలతో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఓ పేరుతో గెలుపెవరిది అని ఫలితాలు ప్రకటించడం కామన్‌గా వస్తూంటుంది. ఎక్కువగా.. నిఖార్సుగా చేసే సర్వేలు తక్కువే. కానీ ఊహాగానాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి.

ఎక్కువగా ఎవరి పార్టీ అభిమానం ప్రకారం.. ఆ పార్టీ కి దగ్గరైన జర్నలిస్టులు.. ఇతరులు వీటిని చేస్తూ ఉంటారు. అయితే హుజురాబాద్ విషయంలో మాత్రం ఇంత వరకూ ఇలాటి సర్వేలు రాలేదు. ఇక ముందు రావడానికికూడా అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. గతంలో నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలోనే పోలింగ్‌కు రెండు, మూడురోజుల ముందు కూడా కొన్ని సంస్థలు సర్వేలు ప్రకటించాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

ఇప్పుడు హుజురాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి కూడా అవకాశం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రకటించకూడదు. నేరుగా ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంటుది. కొత్తగా ఈ నిబంధనలు ఎందుకు అన్న విషయం పక్కన పెడితే.. ఈ సారి ఓటర్లకు పెద్ద న్యూసెన్స్ తప్పినట్లుగా అనుకోవచ్చు. ఒక్క హుజురాబాద్‌కే కాకుండా అన్ని రకాల ఎన్నికలకు ఈ నిబంధన అమలు చేయాలనేది ఎక్కువ మంది కోరుకునే మాట .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close