ఏ మాయ చేశావయ్యా.. హ‌ను మాన్‌

ప్ర‌శాంత్ వ‌ర్మ ‘హ‌ను – మాన్‌’ సినిమా తీస్తున్నాడు అన‌గానే ఎవ‌రూ పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోలేదు. ప్ర‌శాంత్ ముందు నుంచీ.. కొత్త దారిలో వెళ్లే ద‌ర్శ‌కుడే. త‌న టేకింగ్ ఎలా ఉంటుందో జ‌నాలు చూశారు. కానీ.. తేజ స‌జ్జాతో రూ.25 కోట్లు పెట్టి ఎందుకింత సాహ‌సం చేస్తున్నాడు? అస‌లు ఏముంటుంది? ఆ సినిమాలో? వ‌ర్క‌వుట్ అవుతుందా, లేదా? అంటూ అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఎందుకంటే తేజా స‌జ్జా సోలో హీరోగా జాంబిరెడ్డితో హిట్టు కొట్టాడు కానీ, వ‌సూళ్ల ప‌రంగా పెద్ద అద్భుతాలేం సృష్టించ‌లేదు. తేజాతో రూ.10 కోట్ల సినిమా ఓకే. మ‌రీ మూడు రెట్లు బ‌డ్జెట్ పెంచేయ‌డం చర్చ‌నీయాంశం అయ్యింది.

అయితే ఇప్పుడు టీజర్ వ‌దిలాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఆ టీజ‌ర్‌లో విజువ‌ల్స్‌.. మేకింగ్‌, గ్రాఫిక్స్ ఇవ‌న్నీ చూస్తే జ‌నాల మ‌తి పోతోంది. పాతిక కోట్ల‌తో ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీస్తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు టాలీవుడ్ అంతా.. ఈ టీజ‌ర్ గురించే చ‌ర్చ‌. అంద‌రి నోటా.. `వావ్ హ‌నుమాన్` అనే వినిపిస్తోంది. ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలూ లేకుండా ప్ర‌శాంత్ వ‌ర్మ గ‌ప్ చుప్‌గా త‌న ప‌ని తాను చేసుకొంటూ పోయాడు. ”నా సినిమాల‌కంటే టీజ‌ర్లూ,ట్రైల‌ర్లు బాగుంటాయ‌ని బ‌య‌ట చెబుతుంటారు. ఈ టీజ‌ర్ ఎంత బాగుందో ట్రైల‌ర్ అంత బాగుంటుంది. ట్రైల‌ర్ క‌న్నా సినిమా బాగుంటుంది” అంటూ ఇంకా ఇంకా ఊరించేశాడు. ఈసినిమాలో ఇలాంటి స‌ర్‌ప్రైజ్‌లు చాలా ఉన్నాయ‌న్న‌ది జ‌నాల మాట‌.

అయితే మ‌రో వ‌ర్గం ఇప్పుడు ‘హ‌ను మాన్‌’తో ‘ఆదిపురుష్‌’ టీజ‌ర్‌ని పోలుస్తోంది. పాతిక కోట్ల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ స్థాయిలో విజువ‌ల్స్ ఇచ్చాడు క‌దా.. మ‌రి ఓం రౌత్ ఏంటి అలా చేశాడంటూ మీమ్స్ మొద‌లెట్టేశారు. ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డిన‌ట్టు.. హ‌నుమాన్ వెళ్లి… ఆదిపురుష్ పై ప‌డ్డాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ‘హ‌ను మాన్‌’పై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. టీజ‌ర్ తో ఇప్పుడు వంద రెట్ల బాధ్య‌త ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై ప‌డింది. ఇక నుంచి హ‌నుమాన్ నుంచి ఏ చిన్న ప్ర‌చార చిత్రం వ‌చ్చినా .. ఇదే స్థాయి క్వాలిటీ ఆశిస్తారు. సినిమాపైనా ఒత్తిడి పెరుగుతుంది. దీన్నంతా ‘హ‌నుమాన్‌’ ఎలా బ్యాలెన్స్ చేసుకొంటాత‌డ‌న్న‌దానిపై ఈ సినిమా విజ‌యం ఆధార ప‌డి ఉంటుంది. కాక‌పోతే… త్వ‌ర‌లోనే తెలుగు నుంచి మ‌రో విజువ‌ల్ వండ‌ర్ చూడ‌బోతున్నామ‌న్న ధీమా మాత్రం ‘హ‌నుమాన్’ ఇచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close