థియేటర్లకు వచ్చేది కుర్రాళ్లే. నవతరమే బాక్సాఫీసుకు శ్రీరామరక్ష. వాళ్లకు నచ్చే సినిమాలే తీయాలి. వాళ్ల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోవడంలో తప్పేం లేదు. `లిటిల్ హార్ట్స్` లో కనిపించింది ఈ మ్యాజిక్కే. ఇంటర్ పాసై, అప్పుడే డిగ్రీలోకి అడుగుపెట్టిన బ్యాచ్‌కి ఈ సినిమా బాగా నచ్చింది. అందుకే బ్రహ్మరథం పడుతున్నారంతా. ఇప్పుడు టీజేజ్ దాటి, యంగ్ ఏజ్‌లోకి అడుగుపెట్టిన కుర్రాళ్లకు నచ్చేలా ఓ సినిమా రాబోతోంది. అదే.. K- RAMP.
KA తరవాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు బాగానే ఉంటాయి. దానికి తోడు గ్లింప్స్ తో కిర్రెక్కించింది చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ యూత్ ని ఆకట్టుకొనేలా ఉంది. అయితే టీమ్ ఇంకా చాలా సర్ప్రైజ్లు దాచి పెట్టిందని తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు 18 లిప్ లాక్ సీన్లు ఉన్నాయట. అంతేకాదు… యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఒకొక్కటిగా బయటకు వదలాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా ప్రమోషన్లు కూడా వెరైటీగా చేయాలని ఫిక్సయ్యారు. ఇప్పటికే ఓటీటీ, డబ్బింగ్ డీల్స్ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా బాక్సాఫీసు దగ్గర మంచి పోటీ నెలకొంది. దాదాపు 4 సినిమాలు ఈ సీజన్ లో రాబోతున్నాయి. అన్నీ కుర్రాళ్ల సినిమాలే. వాటితో పోలిస్తే… కిరణ్ సినిమాకి కాస్త ఎడ్జ్ దొరికే ఛాన్స్ వుంది.