డిసెంబర్ 4న రాత్రి 9.30 నుంచి అల్లు అర్జున్ పుష్ప రూల్ మొదలైపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతోందనేది కాదు.. పుష్ప2 ఎన్ని రికార్డులు బద్దలు గొడుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చ.
గతంలో ఎన్నడూ లేని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్. పుష్ప కి నార్త్ ఇండియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ అటువంటింది. అందుకే ఈసారి నార్త్ పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టారు. బీహార్ ఈవెంట్ ఏ స్థాయిలో జరిగిందో, అక్కడ పుష్ప ఫీవర్ ఎంతలా ఉందో ప్రత్యక్ష్యంగా అందరికీ కనబడింది.
ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప2 ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇంట్రస్టింగ్ గా మారింది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పుష్ప 2 మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చనే అంశంపై ఒక అంచనాకి వచ్చారు. హిందీ బెల్ట్ లో మొదటి రోజు దాదాపు రూ.80 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం వుందని చెబుతున్నారు. నిజంగా పుష్ప 2 కనుక ఈ ఫిగర్ ని ఎచీవ్ చేస్తే ఒక తెలుగు సినిమా బాలీవుడ్ లో మైల్ స్టోన్ ని సెట్ చేసినట్లే.
‘పుష్ప2’ హయ్యస్ట్ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదలకానుంది. 3 గంటల 20 నిమిషాల రన్ టైమ్ వున్న సినిమా ఇది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడానికి రెడీగా ఉంది.