‘డబ్బు’ చుట్టూ తిరిగే పాటలు తెలుగునాట చాలా పాపులర్. ‘మనీ’ సినిమాలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి పాట ఓ ట్రెండ్ సెట్టర్. నువ్వస్తావనిలో రైలుబండిని నడిపేది.. వేదంలో రూపాయి.. ఇలా చాలా పాపులర్ డబ్బు చుట్టూ తిరిగే పాటలు వున్నాయి. ఇప్పుడు మరో క్యాచి పాట వచ్చింది. ఎఫ్ 2 కి ఫ్రీక్వెల్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. సినిమా మొదలెట్టినప్పుడే .. ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిరిగే ఫస్ట్రేషన్ అని చెప్పాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మొదటి ప్రమోషనల్ సాంగ్ గా డబ్బు పాటని రిలీజ్ చేశారు. దేవిశ్రీ మ్యూజిక్, భాస్కర్ భట్ల సాహిత్యం కలయిక చక్కగా కుదిరింది. మాస్ మెచ్చే ట్యూన్, అందరూ కనెక్ట్ అయ్యే లిరిక్స్తో పాటని డిజైన్ చేశారు.
”లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు.. ఎవడు కనిపెట్టాడో గాని దీని యబ్బో .. క్యాష్ లేని లైఫ్ కష్టాల బాతు టబ్బు .. పైసా వుంటే లోకమంతా పెద్ద డ్యాన్స్ క్లబ్బు. ” అంటూ సాగిన సాకీ తర్వాత ‘పాకెట్ లోన డబ్బుంటే ప్రపంచమే పిల్లౌతుంది. పులై మనం బ్రతికేవచ్చు విశ్వదాభి రామా.. అంటూ సాగిన పల్లవి ఆకట్టుకుంది. పాటలో సాహిత్యం అంతా సగటు మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా వుంది. గాయకుడు రామ్ మిర్యాల పాడిన విధానం కూడా ఆకట్టుకుంది. ఈ పాట విన్నాక.. ఎఫ్ 3కి మంచి ప్రొమోషనల్ స్టార్ట్ దొరికిందని మాత్రం చెప్పొచ్చు. ఎఫ్ 2సూపర్ హిట్. అయితే ఆడియో పరంగా చెప్పుకోదగ్గ పాట లేదు. ఎఫ్ 3కి వచ్చేసరికి మొదటి పాటతోనే బోలెడు బజ్ క్రియేట్ అయ్యేలావుంది.
Venkatesh gonthu bagaledu. Manchi singer ni chudalisindhi.