ఎఫ్ 3.. టార్గెట్ ఫిక్స్‌

ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఎఫ్ 3. క‌రోనా కాటుకి ఈ సినిమా కూడా ఆగిపోయింది. స్క్రిప్టు సిద్ధ‌మైనా.. ప‌ట్టాలెక్కించ‌లేని ప‌రిస్థితి. ఎట్ట‌కేల‌కు…. ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కి అంతా రెడీ. ఇప్పుడు `ఎఫ్ 3` టార్గెట్ ఫిక్స‌యిపోయింది. ఈ వేస‌వికే `ఎఫ్ 3`ని విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు ఫిక్స‌య్యార్ట‌. అందుకు త‌గ్గ‌ట్టే.. చిత్రీక‌ర‌ణ వేగ‌వంతం చేయాల‌ని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్ర‌మిది. త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లు. మూడు నెల‌ల్లో షూటింగ్ పూర్తి చేయాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల టార్గెట్. ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి, మే నాటికి సిద్ధం చేయాల‌ని భావిస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల‌కు సంక్రాంతి మంచి ఆప్ష‌న్‌. ఆ త‌ర‌వాత వేస‌వే. ఈ సంక్రాంతికి ఎలాగూ `ఎఫ్ 3` మిస్స‌య్యింది. అందుకే వేస‌విని ల‌క్ష్యంగా చేసుకుంది. అనిల్ రావిపూడి తీత స్పీడుగానే ఉంటుంది. పైగా ఎఫ్ 3లో ఫైటింగులు, ఛేజింగులు గ‌ట్రా ఉండ‌వు. కాబ‌ట్టి… ఈజీగానే లాగించేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close